Shooting: ఐఎస్‌ఎస్‌ఎఫ్ ప్రపంచకప్ టోర్నీలో భారత్‌కు స్వర్ణం
ఈజిప్ట్ రాజధాని నగరం కైరో వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్‌ఎస్‌ఎఫ్) ప్రపంచకప్‌లో భారత్‌కు స్వర్ణ పతకం లభించింది. మార్చి 3న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో ఇషా సింగ్, రుచిత వినేర్కర్, శ్రీ నివేతలతో కూడిన భారత జట్టు విజేతగా నిలిచింది. స్వర్ణ పతక పోరులో భారత బృందం 16–6 పాయింట్ల తేడాతో సాండ్రా, అండ్రియా, కెరీనాలతో కూడిన జర్మనీ జట్టుపై విజయం సాధించింది.
సౌరభ్ చౌదరీ ఏ క్రీడలో ప్రసిద్ధి చెందాడు?
ఇప్పటి వరకు ఈ టోర్నీలో 2 స్వర్ణాలు, ఒక రజతం నెగ్గిన భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో సౌరభ్ చౌదరీ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించిన విషయం విదితమే. 19 ఏళ్ల సౌరభ్‌కు ప్రపంచకప్ టోర్నీలలో ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం. అలాగే మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత విభాగంలో తెలంగాణ అమ్మాయి ఇషా సింగ్ రజతం దక్కించుకుంది. ఇక తాజాగా మహిళల 10 మీటర్ల ఎయిర్‌పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రపంచకప్ షూటింగ్ టోర్నమెంట్(ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్)లో స్వర్ణం గెలిచిన జట్టు?
ఎప్పుడు : మార్చి 1
ఎవరు : ఇషా సింగ్, రుచిత వినేర్కర్, శ్రీ నివేతలతో కూడిన భారత జట్టు
ఎక్కడ : కైరో, ఈజిప్ట్
ఎందుకు : మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత జట్టు 16–6 పాయింట్ల తేడాతో సాండ్రా, అండ్రియా, కెరీనాలతో కూడిన జర్మనీ జట్టుపై విజయం సాధించినందున..
Cricket: మహిళల వన్డే వరల్డ్‌కప్–2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్