Skip to main content

Cricket: మహిళల వన్డే వరల్డ్‌కప్‌–2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?

ICC Women's World Cup 2022

మహిళల వన్డే వరల్డ్‌కప్‌–2022కు న్యూజిలాండ్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 3 వరకు 6 వేదికల్లో టోర్నీ (మొత్తం 31 మ్యాచ్‌లు) నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 3న క్రైస్ట్‌చర్చ్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది. టోర్నీలో 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఆతిథ్య హోదాలో న్యూజిలాండ్‌ అర్హత సాధించగా, ఐసీసీ ర్యాంకింగ్‌ ప్రకారం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, దక్షిణాఫ్రికాలకు అవకాశం దక్కింది. మిగిలిన మూడు స్థానాలను క్వాలిఫయింగ్‌ టోర్నీ ద్వారా ఎంపిక చేయాల్సి ఉండగా... కోవిడ్‌ ప్రభావంతో ఆ టోర్నీ రద్దయింది. దాంతో మళ్లీ వన్డే ర్యాంకింగ్‌ ప్రకారమే పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్‌కు ఐసీసీ అవకాశం కల్పించింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్‌ పాల్గొనడం ఇదే తొలిసారి.

భారత మహిళల జట్టు కెప్టెన్‌గా ఎవరు వ్యవహరించనున్నారు?
మహిళల వన్డే వరల్డ్‌కప్‌–2022లో పాల్గొనే భారత మహిళల జట్టుకు మిథాలీ రాజ్‌ సారథ్యం వహించనుంది.
భారత మహిళల జట్టు: మిథాలీ రాజ్‌ (కెప్టెన్‌), హర్మన్‌ప్రీత్‌ (వైస్‌ కెప్టెన్‌), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక, దీప్తి శర్మ, రిచా ఘోష్, స్నేహ్‌ రాణా, జులన్‌ గోస్వామి, పూజా వస్త్రకర్, మేఘన సింగ్, రేణుక సింగ్‌ , తానియా, రాజేశ్వరి, పూనమ్‌ యాదవ్‌.

ప్రైజ్‌మనీ ఎంతంటే: 2017 కంటే ఈసారి ప్రైజ్‌మనీని రెట్టింపు చేశారు. విజేతకు 13 లక్షల 20 వేల డాలర్లు (రూ. 10 కోట్లు), రన్నరప్‌ జట్టుకు 6 లక్షల డాలర్లు (రూ. 4 కోట్ల 54 లక్షలు), సెమీస్‌లో ఓడిన జట్లకు 3 లక్షల డాలర్ల (రూ. 2 కోట్ల 26 లక్షలు) చొప్పున లభిస్తాయి.

6వ వన్డే వరల్డ్‌ కప్‌: మిథాలీ రాజ్‌కు ఇది 6వ వన్డే వరల్డ్‌ కప్‌. ఈ ఘనత సాధించిన తొలి ప్లేయర్‌గా ఆమె నిలవనుంది.
గత రికార్డు: మహిళల వన్డే వరల్డ్‌కప్‌ 11 సార్లు  జరగ్గా్గ... ఆస్ట్రేలియా  6 సార్లు, ఇంగ్లండ్‌ 4 సార్లు, న్యూజిలాండ్‌ ఒకసారి విజేతగా నిలిచాయి.

చ‌ద‌వండి: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో రజతం గెలిచిన భారతీయురాలు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
మహిళల వన్డే వరల్డ్‌కప్‌–2022కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం?
ఎప్పుడు : మార్చి 4 నుంచి ఏప్రిల్‌ 3 వరకు
ఎవరు    : న్యూజిలాండ్‌
ఎక్కడ    : న్యూజిలాండ్‌లోని మొత్తం 6 వేదికల్లో..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 03 Mar 2022 03:32PM

Photo Stories