Skip to main content

Shooting: ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌లో రజతం గెలిచిన భారతీయురాలు?

ఇషా సింగ్‌, సౌరభ్‌ చౌదరీ

సీనియర్‌ విభాగంలో తొలిసారి ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌(ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌)లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ యువ షూటర్‌ ఇషా సింగ్‌కు రజత పతకం లభించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగంలో 17 ఏళ్ల ఇషా సింగ్‌ రజత పతకం కైవసం చేసుకుంది. మార్చి 1న ఈజిప్ట్‌ రాజధాని నగరం కైరో వేదికగా జరిగిన ఫైనల్లో ఇషా 4–16 పాయింట్ల తేడాతో ‘రియో ఒలింపిక్స్‌’ స్వర్ణ పతక విజేత అనా కొరాకాకి (గ్రీస్‌) చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ భాగంలో సౌరభ్‌ చౌదరీ భారత్‌కు స్వర్ణ పతకాన్ని అందించాడు. ఫైనల్లో సౌరభ్‌ 16–6తో మైకేల్‌ ష్వాల్డ్‌ (జర్మనీ)పై గెలిచాడు. 19 ఏళ్ల సౌరభ్‌కు ప్రపంచకప్‌ టోర్నీలలో ఇది మూడో పసిడి పతకం కావడం విశేషం.

International Olympic Committee: ఐఓసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    :
ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నమెంట్‌(ఐఎస్‌ఎస్‌ఎఫ్‌ వరల్డ్‌ కప్‌)లో రజత పతకం గెలిచిన షూటర్‌?
ఎప్పుడు : మార్చి 1
ఎవరు    : తెలంగాణ యువ షూటర్‌ ఇషా సింగ్‌
ఎక్కడ    : కైరో, ఈజిప్ట్‌
ఎందుకు : మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ విభాగం ఫైనల్లో  ఇషా 4–16 పాయింట్ల తేడాతో ‘రియో ఒలింపిక్స్‌’ స్వర్ణ పతక విజేత అనా కొరాకాకి (గ్రీస్‌) చేతిలో ఓడిపోయినందున..

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 02 Mar 2022 01:13PM

Photo Stories