International Olympic Committee: ఐఓసీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) రష్యా యుద్ధోన్మాదాన్ని తీవ్రంగా ఖండిస్తోంది. రష్యాతో పాటు ఆ దేశ మిలిటరీ చర్యకు సాయం చేస్తున్న బెలారస్‌పై అంతర్జాతీయ క్రీడా సమాజం నిషేధం విధించాలని గట్టిగా కోరింది. ఐఓసీ ప్రధాన కార్యాలయం స్విట్జర్‌ల్యాండ్‌లోని లూసానే నగరంలో ఉంది. ప్రస్తుతం ఐఓసీ ప్రెసిడెంట్‌గా థామస్ బాచ్ ఉన్నారు. మరోవైపు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య రష్యా, బెలారస్‌లకు కేటాయించిన బ్యాడ్మింటన్ టోర్నీలన్నీ రద్దు చేసింది. అంతర్జాతీయ అక్వాటిక్స్ సమాఖ్య 2022, ఆగస్టులో రష్యాలో నిర్వహించాల్సిన ప్రపంచ జూనియర్ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌ను రద్దు చేసింది.
ఎలీనా స్వితోలినా ఏ క్రీడలో ప్రసిద్ధురాలు?
ఉక్రెయిన్ టెన్నిస్ స్టార్, ప్రపంచ 15వ ర్యాంకర్ ఎలీనా స్వితోలినా ఇకపై మహిళల టెన్నిస్ సంఘం (డబ్ల్యూటీఏ) టోర్నీల్లో గెలిచిన ప్రైజ్‌మనీ మొత్తాన్ని తమ సైన్యానికి విరాళంగా ఇస్తానని ఫిబ్రవరి 28న ప్రకటించింది. ఆమె ఈ వారం మాంటేరి సహా, ఇండియన్ వెల్స్, మయామి టోర్నీల్లో పాల్గొననుంది. రష్యా యుద్ధంతో ప్రస్తుతం ఉక్రెయిన్ అంతటా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ఎంపికైన ఆటగాడు?
ఐపీఎల్–2022 సీజన్ కోసం పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ తమ జట్టు కెప్టెన్‌ను ప్రకటించింది. టీమ్‌లో కీలక ఆటగాడైన ఓపెనర్ మయాంక్ అగర్వాల్‌కు పంజాబ్ సారథ్య బాధ్యతలు అప్పగించింది. మయాంక్ 2018 నుంచి పంజాబ్‌కు ఆడుతున్నాడు. పంజాబ్‌కు ముందు లీగ్‌లో మయాంక్ ఢిల్లీ, పుణే, బెంగళూరు జట్ల తరఫున ఆడాడు. ఓవరాల్‌గా అతను 11 సీజన్ల ఐపీఎల్‌లో 135.47 స్ట్రయిక్‌రేట్‌తో 2,131 పరుగులు చేశాడు.
Tennis: ఏటీపీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం కైవసం చేసుకున్న ఆటగాడు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్