Cricket: ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్న సంస్థ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌గా భారత్‌కు చెందిన ప్రఖ్యాత సంస్థ ‘టాటా గ్రూప్’ వ్యవహరించనుంది. ఇప్పటి వరకు లీగ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన చైనా మొబైల్ కంపెనీ ‘వివో’ తప్పుకోవాలని నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో వివో స్థానంలో టాటా గ్రూప్ లీగ్‌తో జత కట్టనుంది. ఈ విషయాన్ని జనవరి 11న ఐపీఎల్ లీగ్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ నిర్ధారించారు. ఐపీఎల్ రెండు సీజన్లకు (2022, 2023) ఇది వర్తిస్తుంది.
2018–2022 వరకు ఐదేళ్ల కాలానికిగాను రూ.2,200 కోట్లు చెల్లించేలా బీసీసీఐతో వివో ఒప్పందం చేసుకుంది. అయితే 2020లో గాల్వాన్ లోయలో ఘర్షణలు జరిగి భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బ తినడంతో ఆ ఏడాది లీగ్ నుంచి వివో తప్పుకోగా, తాత్కాలిక ప్రాతిపదికన ‘డ్రీమ్ 11’ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే 2021లో మళ్లీ వివోనే కొనసాగింది. వివో ఒప్పందాన్ని 2023 వరకు బీసీసీఐ పొడిగించింది. తాజాగా వివో తమంతట తామే వైదొలగడంతో టాటా సంస్థ వచ్చే రెండేళ్ల పాటు స్పాన్సర్‌గా వ్యవహరించనుంది. టాటా గ్రూప్ రెండేళ్ల కోసం రూ. 670 కోట్లు (ఏడాదికి రూ. 335 కోట్లు) చెల్లిస్తుంది.
చదవండి: ఇండియా ఓపెన్–2022కు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్న సంస్థ?
ఎప్పుడు : జనవరి 10
ఎవరు : భారత్‌కు చెందిన ప్రఖ్యాత సంస్థ టాటా గ్రూప్
ఎందుకు : ఇప్పటి వరకు లీగ్‌కు ప్రధాన స్పాన్సర్‌గా వ్యవహరించిన చైనా మొబైల్ కంపెనీ ‘వివో’ తప్పుకోవాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్