IOC approves cricket at 2028 Olympics: ఒలింపిక్స్‌లో క్రికెట్‌తో పాటు మరో నాలుగు క్రీడలకు ఐవోసీ ఆమోదం
ఈ నేపథ్యంలో 128 ఏళ్ల తర్వాత మళ్లీ క్రికెట్ ఒలింపిక్స్‌లో భాగం కానుంది. క్రికెట్‌తో పాటు బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోసీ క్రీడలను కూడా 2028 ఒలింపిక్స్‌లో చేర్చారు.
IOC Bans Russian Olympic Committee: రష్యా ఒలింపిక్ కమిటీపై నిషేధం
ఐవోసీ సెషన్ గ్రీన్ సిగ్నల్..
అయితే ఈ ప్రతిపాదనకు ఇప్పటికే అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఎగ్జిక్యూటివ్ బోర్డు శుక్రవారం అంగీకారం తెలపగా.. తాజాగా సోమవారం ముంబైలో జరిగిన ఇంటర్ననేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) సదస్సులో ఓటింగ్ నిర్వహించారు.
ఈ మీటింగ్‌లో ఇందుకు కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. మిగితా సభ్యులందరూ అంగీకారం తెలిపారు. దీంతో ఈ ఐదు క్రీడలను 2028 ఒలింపిక్స్‌లో చేర్చేందుకు మార్గం సుగమమైంది.
Cricket in Olympics: 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్
ఈ మేరకు.. ‘‘లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్‌లో ఐదు కొత్త క్రీడలను చేర్చాలనే ప్రతిపాదనను ఐవోసీ సెషన్ ఆమోదించింది. క్రికెట్, బేస్‌బాల్, సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, స్క్వాష్, లాక్రోసీ వంటి క్రీడలు లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో ఉంటాయి’’ అని ఒలింపిక్ కమిటీ ఎక్స్(ట్విటర్)లో పేర్కొంది.
అదే విధంగా ఈ మీటింగ్ అనంతరం ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ మాట్లాడుతూ.. "క్రికెట్‌లో టీ20 ఫార్మాట్‌కు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది. అందుకే టీ20 ఫార్మాట్‌లో పోటీలను నిర్వహించాలని నిర్ణయించుకున్నాం. వన్డే ఫార్మాట్ ఇప్పటికే అత్యంత విజయవంతమైందని" అని పేర్కొన్నారు.
Tags
- IOC approves cricket at 2028 Olympics
- Cricket in Olympics
- IOC approves proposal to include cricket and four other new games
- Cricket confirmed for Olympics
- International Olympic Committee session
- Cricket
- Olympics
- Los Angeles
- Baseball
- softball competitions
- Squash
- latest sports news in Telugu
- sakshi education sportsnews