Archery World Cup: ప్రపంచకప్ టోర్నీలో సత్తా చాటిన భారత ఆర్చరీ జట్టు!
ఏప్రిల్ 28వ తేదీ జరిగిన రికర్వ్ టీమ్ విభాగం ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్, తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాధవ్‌లతో కూడిన భారత జట్టు 5–1 (57–57, 57–55, 55–53)తో సంచలన విజయం సాధించింది.
తద్వారా 14 ఏళ్ల తర్వాత ప్రపంచకప్ టోర్నీలో టీమ్ విభాగంలో పసిడి పతకం సొంతం చేసుకుంది. చివరిసారి భారత్ 2010 ఆగస్టులో షాంఘైలోనే జరిగిన ప్రపంచకప్ స్టేజ్–4 టోర్నీలో స్వర్ణం సాధించింది. రికర్వ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో ధీరజ్ –అంకిత ద్వయం కాంస్య పతకం గెలిచింది.
కాంస్య పతక మ్యాచ్‌లో ధీరజ్–అంకిత జోడీ 6–0 (35–31, 38–35, 39–37)తో వలెన్సియా–మతియాస్ (మెక్సికో) జంటపై నెగ్గింది. మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగం ఫైనల్లో భారత స్టార్ దీపిక కుమారి 0–6 (26–27, 27–29, 27–28)తో ఆసియా క్రీడల చాంపియన్ లిమ్ సిహైన్ (కొరియా) చేతిలో ఓడిపోయి రజత పతకం దక్కించుకుంది.
Sreeja Akula: టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి నంబర్ వన్!
Tags
- Archery World Cup
- India vs South Korea
- Pravin Jadhav
- Tarundeep Rai
- Dhiraj Bommadevara
- Olympic champion
- Paris Olympics
- Indian men's team
- Ankita Bhakat
- IndianArchery
- RecurveTeam
- FinalMatch
- TokyoOlympicsChampion
- BommadewaraDheeraj
- TarundeepRoy
- PraveenJadhav
- Victory
- SouthKorea
- AndhraPradeshArcher
- sakshieducation sports news