Asian Para Games 2023: 111 పతకాలతో ఐదో స్థానంలో భారత్
Sakshi Education
పారా ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు సత్తా చాటారు. మునుపెన్నడు లేని విధంగా ఈ క్రీడల్లో తొలిసారి పతకాల సెంచరీని సాధించారు.
India finishes with 111 medals in Asian Para Games 2023
చైనా ఆతిథ్యమిచ్చిన ఈ ఆసియా మెగా ఈవెంట్‌లో ఏకంగా 111 పతకాలతో భారత్ టాప్–5లో నిలిచింది. ఇందులో 29 స్వర్ణాలు, 31 రజతాలు, 51 కాంస్య పతకాలున్నాయి. ఇటీవలే ఆసియా క్రీడల్లో భారత్ 107 పతకాలతో నాలుగో స్థానం సాధించగా...ఇప్పుడు భారత బృందానికి ఐదో స్థానం లభించింది.
ఆతిథ్య చైనా పారా అథ్లెట్లు 521 పతకాలతో పట్టికలో అగ్ర స్థానంలో నిలిచారు. రెండో మూడు స్థానాల్లో ఇరాన్ (131), జపాన్ (150) వరుసగా నిలిచాయి. దక్షిణ కొరియా (103) మనకన్నా తక్కువ పతకాలు సాధించినప్పటికీ ఒకే ఒక్క స్వర్ణం తేడాతో నాలుగో స్థానంలో నిలిచింది. కొరియా 30 బంగారు పతకాలు నెగ్గితే... భారత్ 29 గెలిచింది.