Skip to main content

National Sports Awards: శిక్ష ముగిసిన డోపీలకూ జాతీయ క్రీడా పురస్కారాలు

ప్రతిష్టాత్మక జాతీయ క్రీడా పురస్కారాలకు డోపింగ్‌ ఉచ్చులో పడి శిక్ష పూర్తి చేసుకున్న క్రీడాకారుల పేర్లను కూడా ఇకపై పరిశీలించనున్నారు.
National Sports Awards

దీంతో అమిత్‌ పంఘాల్‌లాంటి భారత స్టార్‌ బాక్సర్‌కు ‘అర్జున’ తదితర అవార్డులు దక్కనున్నాయి. 2012లో డోపింగ్‌ మరక వల్లే అమిత్‌ అవార్డులకు దూరమయ్యాడు. అయితే నిషేధకాలం పూర్తి చేసుకున్న వారినే ఎంపిక చేస్తారు. 2021 ఏడాది టోక్యో ఒలింపిక్స్‌ వల్లే జాతీయ క్రీడా పురస్కారాల ఎంపిక, ప్రదానోత్సవ కార్యక్రమం వాయిదా పడింది. ఒలింపిక్స్‌ పతక విజేతలకు కూడా అవకాశమివ్వాలనే ఉద్దేశంతో కేంద్ర క్రీడాశాఖ ఈ ప్రక్రియను వాయిదా వేసింది. త్వరలోనే ప్రతిపాదనలు స్వీకరించి అవార్డు విజేతలను ప్రకటించనుంది. 
 

Published date : 09 Sep 2021 06:54PM

Photo Stories