Skip to main content

National Sports Day 2023: ఐదు పాఠశాలలకు క్రీడా ప్రతిభ అవార్డులు

జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లాలో ఉత్తమ క్రీడా ప్రతిభ కనబరిచిన ఐదు పాఠశాలలకు క్రీడా ప్రతిభ (స్కూల్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ ఎక్సలెన్స్‌) అవార్డులు అందజేశారు.
డీఈవో నుంచి అవార్డు అందుకుంటున్న తోలేరు హైస్కూల్‌ హెచ్‌ఎం శ్యాంప్రసాద్‌
డీఈవో నుంచి అవార్డు అందుకుంటున్న తోలేరు హైస్కూల్‌ హెచ్‌ఎం శ్యాంప్రసాద్‌

గొరగనమూడిలోని స్వామి జ్ఞానానంద ఉన్నత పాఠశాల ప్రథమ స్థానం సాధించి బెస్ట్‌ స్కూల్‌గా డీఈవో ఆర్‌.వెంకటరమణ చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక స్వీకరించినట్లు స్కూల్‌ ప్రధానోపాధ్యాయురాలు బి.శ్రీదేవి మంగళవారం చెప్పారు. రాష్ర ప్రభుత్వం గత సంవత్సరం స్కూల్‌ గేమ్స్‌లో క్రీడాకారులు జోనల్‌, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలలో చూపిన ప్రతిభ ఆధారంగా జిల్లాలో తొలి 5 స్థానాలు పాయింట్స్‌ ఆధారంగా ప్రకటించి ఈ అవార్డులు ఇచ్చిందని, ఇందులో గొరగనమూడి హైస్కూల్‌ ప్రథమ స్థానం, భీమవరం ఎస్‌సీహెచ్‌బీఆర్‌ఎం ఉన్నత పాఠశాల ద్వితీయ, వీరవాసరం మండలం తోలేరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల తృతీయ స్థానం, మార్టేరు ఎస్‌వీజీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల నాలుగో స్థానం, అత్తిలి ఎస్‌వీఎస్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఐదో స్థానం సాధించాయని చెప్పారు.

Also read: Open schools: ఓపెన్‌ స్కూల్‌ విద్య.. రెగ్యులర్‌ కోర్సులతో సమానం.. అడ్మిషన్లకు చివరి తేదీ

ఈ అవార్డుల ప్రదానోత్సవం జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో జరిగిందన్నారు. జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల అసోసియేషన్‌ జిల్లా కార్యదర్శి ఎండి ఖుద్ధూస్‌, అధ్యక్షులు కృష్ణారెడ్డి, జిల్లా స్కూల్‌ గేమ్స్‌ కార్యదర్శి బి.జాన్సన్‌ ఉపాధ్యాయులు, గొరగనమూడి సర్పంచ్‌ గొట్టుముక్కల శివాజీరాజు, పాఠశాల పేరేంట్స్‌ కమిటీ చైర్మన్‌ పొన్నమండ బాలకృష్ణ, స్వామి జ్ఞానానంద, ట్రస్ట్‌ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Also read: Food Safety Awareness: మధ్యాహ్న భోజనంతోనే విద్యార్థులు బడి బాట

తోలేరు హైస్కూల్‌కు అవార్డు

వీరవాసరం: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని తోలేరు జెడ్పీ హైస్కూల్‌ జిల్లా స్థాయిలో క్రీడా ప్రతిభ అవార్డు సొంతం చేసుకుందని, ఈ మేరకు మంగళవారం డీఈఓ ఆర్‌ వెంకటరమణ చేతుల ప్రశంసాపత్రం, జ్ఞాపిక స్వీకరించినట్టు హెచ్‌ఎం బీఎంజెడ్‌ శ్యాంప్రసాద్‌ తెలిపారు. గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రీడా పోటీల్లో జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో విద్యార్థులు ప్రతిభచూపడంతో ఈ అవార్డు అందుకున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ వేంద్ర లీలాకృష్ణ, పేరంట్స్‌ కమిటీ చైర్మన్‌ వంకాయల విజయ్‌కుమార్‌ పాఠశాల హెచ్‌ఎం, వ్యాయామ ఉపాధ్యాయుడు పూడి శ్రీనివాస్‌లను ప్రత్యేకంగా అభినందించారు.

 

CM Jagan Disburses Funds for Jagananna Vidya Deevena Scheme at Nagari Meeting #sakshieducation

Published date : 30 Aug 2023 07:12PM

Photo Stories