24th Summer Deaflympics: భారత షూటర్ ధనుష్‌కు స్వర్ణ పతకం
బ్రెజిల్ వేదికగా జరుగుతోన్న 24వ బధిరుల ఒలింపిక్స్(డెఫ్లింపిక్స్) లో భారత షూటర్ ధనుష్ శ్రీకాంత్ సత్తా చాటాడు. పురుషల షూటింగ్ 10 మీటర్ల విభాగంలో «తెలంగాణకు చెందిన దనుష్ పసిడి పతకం సాధించాడు. ఫైనల్లో 247.5 పాయింట్లు సాధించి దనుష్ బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
GK Important Dates Quiz: ప్రపంచ NGO దినోత్సవాన్ని ఏటా ఏ రోజున జరుపుకుంటారు?
సైనీకి రజతం..
అదే విధంగా మరో భారత షూటర్ శౌర్య సైనీ 10 మీటర్ల విభాగంలో రజత పతకం గెలుచుకున్నాడు. ఇక ఇప్పటి వరకు డెఫ్లింపిక్స్‌లో భారత్ మూడు పతకాలు తన ఖాతాలో వేసుకుంది. మరో వైపు బ్యాడ్మింటన్‌లో కూడా భారత్ పసిడి పతకం కైవసం చేసుకుంది.
బధిరుల ఒలింపిక్స్–2021
24వ బధిరుల ఒలింపిక్స్–2021(24th Summer Deaflympics-2021)ను బ్రెజిల్‌లోని కాక్సియాస్ దో సుల్(Caxias do Sul) నగర వేదికగా నిర్వహించనున్నారు. 2022 మే 1వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. వాస్తవానికి ఈ క్రీడలను షేడ్యూలు ప్రకారం 2021 ఏడాదిలోని నిర్వహించాలి.. అయితే కరోనా మహమ్మారి కారణంగా 2022 ఏడాదికి వాయిదా వేశారు.
బధిరుల ఒలింపిక్స్–2021 నినాదం(Motto) : స్పోర్ట్స్ కమ్స్ ఫ్రమ్ ద అవర్ హార్ట్స్(Sports comes from the our hearts)
Cricket: మహిళల టి20 చాలెంజ్ టోర్నీని ఎక్కడ నిర్వహించనున్నారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్