Cricket: మహిళల టి20 చాలెంజ్ టోర్నీని ఎక్కడ నిర్వహించనున్నారు?
మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్–2022 వేదిక మారింది. మూడు జట్లతో కూడిన ఈ టోర్నీ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నోలో కాకుండా మహారాష్ట్ర పుణేలో మే 23 నుంచి 28 వరకు జరుగుతుందని బీసీసీఐ తెలిపింది. కరోనా కారణంగా 2021 ఏడాది ఈ టోర్నీని నిర్వహించలేదు. గత నెలలో బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం తర్వాత మహిళల టి20 చాలెంజ్ టోర్నీ లక్నోలో నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ప్రకటించాడు. ఇప్పుడు ఈ టోర్నీ వేదికను లక్నో నుంచి పుణేకు మార్చారు.
GK International Quiz: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి వైదొలుగుతామని బెదిరించినది?
మనిక బత్రా ఏ క్రీడలో ప్రసిద్ధి చెందింది?
అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ మనిక బత్రా కెరీర్ బెస్ట్ ర్యాంక్‌కు చేరుకుంది. తాజా ర్యాంకింగ్స్‌లో మనిక మహిళల సింగిల్స్‌లో 10 స్థానాలు ఎగబాకి 38వ ర్యాంక్‌ను అందుకుంది. 2021 ఏడాది లాస్కో, బుడాపెస్ట్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ కంటెండర్ టోర్నీలలో మనిక సెమీఫైనల్ చేరుకొని కాంస్య పతకాలు సాధించింది. పురుషుల సింగిల్స్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 34వ ర్యాంక్‌లో, ఆచంట శరత్ కమల్ 37వ ర్యాంక్‌లో ఉన్నారు. హైదరాబాద్ ప్లేయర్ సూరావజ్జుల స్నేహిత్ 172 స్థానాలు ఎగబాకి 114వ ర్యాంక్‌లో నిలిచారు.
విండీస్ కొత్త కెప్టెన్‌గా పూరన్
వెస్టిండీస్ వన్డే, టి20 జట్లకు కొత్త కెప్టెన్‌గా వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను నియమించారు. విండీస్ వన్డే, టి20 జట్లకు కెప్టెన్‌గా ఉన్న కీరన్ పొలార్డ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్లు ఇటీవల ప్రకటించాడు. దాంతో పొలార్డ్ స్థానంలో పూరన్‌ను నియమించారు.Weightlifting: ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన క్రీడాకారిణి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల టి20 చాలెంజ్ క్రికెట్ టోర్నమెంట్–2022 వేదిక మార్పు
ఎప్పుడు : మే 03
ఎవరు : బీసీసీఐ
ఎక్కడ : పుణే, మహారాష్ట్ర
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్