South Africa's T20 లీగ్ కమిషనర్‌గా గ్రేమ్ స్మిత్
దక్షిణాఫ్రికా మెరుపుల లీగ్‌కు తమ దిగ్గజ బ్యాటర్ గ్రేమ్ స్మిత్‌ను కమిషనర్‌గా నియమించింది. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్ తరహా టి20 లీగ్‌కు శ్రీకారం చుట్టిన క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్‌ఏ) ఇందుకు తగ్గట్లే ఏర్పాట్లు చేస్తోంది. జనవరి–ఫిబ్రవరి మాసాల్లో టి20 లీగ్ షెడ్యూల్ ఉండేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగా లీగ్ కమిషనర్, ఫ్రాంచైజీల వేలం కార్యక్రమాల్ని కూడా నిర్వహించింది. స్మిత్ స్పందిస్తూ సఫారీ క్రికెట్‌కు అంకితభావంతో సేవలందించేందుకు తానెప్పుడు సిద్ధమేనని... కొత్త బాధ్యతల్ని సంతోషంగా స్వీకరిస్తానని చెప్పాడు.
Also read: FIH అధ్యక్ష పదవికి నరీందర్ బత్రా రాజీనామా
ఆరు ఫ్రాంచైజీలు మనోళ్లవే!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో విజయవంతమై భాగస్వాములైన భారత ఫ్రాంచైజీలే ఇప్పుడు దక్షిణాఫ్రికా లీగ్‌లో భాగమవుతున్నాయి. మొత్తం ఆరుకు ఆరు ఫ్రాంచైజీల్ని మన పారిశ్రామికవేత్తలే కొనుగోలు చేయడం విశేషం. ముకేశ్ అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్ కేప్‌టౌన్ జట్టును కైవసం చేసుకోగా, సిమెంట్ పరిశ్రమల యజమాని, భారత బోర్డు మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్‌కు చెందిన చెన్నై సూపర్‌కింగ్స్ జొహన్నెస్‌బర్గ్‌ను దక్కించుకుంది. జీఎంఆర్–జిందాల్‌కు చెందిన ఢిల్లీ క్యాపిటల్స్ ప్రిటోరియాను, గోయెంకా గ్రూప్ లక్నో సూపర్‌జెయింట్స్ ఫ్రాంచైజీ డర్బన్‌ను, నన్‌రైజర్స్ ఫ్రాంచైజీ పోర్ట్ ఎలిజబెత్‌ను, రాజస్తాన్ రాయల్స్ పార్ల్ ఫ్రాంచైజీలను కొనుగోలు చేశాయి.
Also read: World Cup Shooting Tournament: ప్రపంచకప్ షూటింగ్ టోర్నీ - స్కిట్ లో భారత్‌కు తొలి స్వర్ణం
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP