Mens Hockey: ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్-2021 ఏ నగరంలో జరగనుంది?
2021, నవంబర్ 24 నుంచి ఒడిశా రాజధాని భువనేశ్వర్ భువనేశ్వర్‌లో ఉన్న కళింగ స్టేడియం వేదికగా జరిగే జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్–2021 షెడ్యూల్‌ను అక్టోబర్ 20న విడుదల చేశారు. డిఫెండింగ్ చాంపియన్ భారత్ నవంబర్ 24న జరిగే తమ తొలి మ్యాచ్‌లో ఫ్రాన్స్‌తో తలపడనుంది. డిసెంబర్5న ఫైనల్స్ జరుగుతాయి. పూల్ ‘బి’లో భారత్‌తోపాటు కెనడా, ఫ్రాన్స్, పోలాండ్ జట్లకు చోటు కల్పించారు. పూల్ ‘ఎ’లో బెల్జియం, చిలీ, మలేసియా, దక్షిణాఫ్రికా... పూల్ ‘సి’లో దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, స్పెయిన్, అమెరికా... పూల్ ‘డి’లో అర్జెంటీనా, ఈజిప్ట్, జర్మనీ, పాకిస్తాన్ జట్లు ఉన్నాయి. 2016 ప్రపంచకప్ టోర్నీకి కూడా భారతే(ఉత్తరప్రదేశ్‌లోని లక్నో నగరం) వేదికగా నిలిచింది.
దక్షిణాఫ్రికాలో మహిళల టోర్ని...
2021, డిసెంబర్ 5 నుంచి 16 వరకు దక్షిణాఫ్రికాలోని పాట్‌చెఫ్‌స్ట్రూమ్ నగరంలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ నార్త్ వెస్ట్ వేదికగా జరిగే జూనియర్ మహిళల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్–2021 షెడ్యూల్‌ను కూడా ప్రకటించారు. పూల్ ‘సి’లో ఉన్న భారత్ డిసెంబర్ 6న తొలి మ్యాచ్‌లో రష్యాతో ఆడుతుంది.
చదవండి: ఎంసీసీలో జీవితకాల సభ్యత్వం పొందిన భారత క్రికెటర్లు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్–2021
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : భారత్
ఎక్కడ : కళింగ స్టేడియం, భువనేశ్వర్, ఒడిశా
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్