Skip to main content

Cricket: ఎంసీసీలో జీవితకాల సభ్యత్వం పొందిన భారత క్రికెటర్లు?

Harbhajan Singh, Javagal Srinath

భారత మాజీ క్రికెటర్లు జవగళ్‌ శ్రీనాథ్, హర్భజన్‌ సింగ్‌లకు ప్రసిద్ధ మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ)లో జీవితకాల సభ్యత్వం లభించింది. టెస్టు క్రికెట్‌ ఆడే 12 దేశాల నుంచి ఎనిమిది దేశాల క్రికెటర్లకు 2021 ఏడాది జీవితకాల సభ్యత్వం ఇచ్చినట్లు ఎంసీసీ అక్టోబర్‌ 19న ఒక ప్రకటనలో తెలిపింది. మేటి పేసర్‌గా భారత జట్టుకు సేవలందించిన శ్రీనాథ్‌ ప్రస్తుతం ఐసీసీ ఎలైట్‌ మ్యాచ్‌ రిఫరీ ప్యానెల్‌లో ఉన్నారు. శ్రీనాథ్‌ తన అంతర్జాతీయ కెరీర్‌లో వన్డేల్లో 315 వికెట్లు, టెస్టుల్లో 236 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్‌ మూడు ఫార్మాట్లలో కలిపి 711 వికెట్లు తీశాడు.

టీటీ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన రెండో భారతీయుడు?

భారత టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) యువతార పాయస్‌ జైన్‌ అరుదైన ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీటీ సమాఖ్య ప్రపంచ ర్యాంకింగ్స్‌ అండర్‌–17 బాలుర సింగిల్స్‌లో వరల్డ్‌ నంబర్‌వన్‌ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఇటీవల పాయస్‌ జైన్‌ మూడు అంతర్జాతీయ టైటిల్స్‌ సాధించాడు. మానవ్‌ ఠక్కర్‌ (అండర్‌–21) తర్వాత ఐటీటీఎఫ్‌ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా నిలిచిన రెండో భారతీయ ప్లేయర్‌గా పాయస్‌ జైన్‌ నిలిచాడు.
 

చ‌ద‌వండి: వెయిట్‌లిఫ్టర్‌ చాను ఏ సంస్థ అంబాసిడర్‌గా నియమితులైంది?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : ప్రసిద్ధ మెరిల్‌బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (ఎంసీసీ)లో జీవితకాల సభ్యత్వం పొందిన భారత క్రికెటర్లు?
ఎప్పుడు : అక్టోబర్‌ 19
ఎవరు    : భారత మాజీ క్రికెటర్లు జవగళ్‌ శ్రీనాథ్, హర్భజన్‌ సింగ్‌ 
ఎందుకు : ఎంసీసీ నిర్ణయం మేరకు...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 20 Oct 2021 03:06PM

Photo Stories