Tokyo Olympics: వెయిట్‌లిఫ్టర్ చాను ఏ సంస్థ అంబాసిడర్‌గా నియమితులైంది?
టోక్యో ఒలింపిక్స్–2020 విజేతలైన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను, రెజ్లర్ బజరంగ్ పునియాలను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకున్నట్లు అమృతాంజన్ హెల్త్‌కేర్ వెల్లడించింది. జాయింట్ మజిల్ స్ప్రే, పెయిన్ ప్యాచ్, బ్యాక్ పెయిన్ రోల్ ఆన్ వంటి నొప్పి నివారణ ఉత్పత్తులకు వీరు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తారని సంస్థ సీఎండీ శంభు ప్రసాద్ అక్టోబర్ 18న తెలిపారు. 2021 ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్–2020లో వెయిట్ లిఫ్టింగ్ మహిళల 49 కిలోల విభాగంలో రజత పతకం సాధించింది. ఇక రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టయిల్ 65 కేజీల విభాగం బజరంగ్ పూనియా కాంస్య పతకం గెలిచాడు.
హిస్సార్‌లో బాక్సింగ్ చాంపియన్‌షిప్
హరియాణ రాష్ట్రం హిస్సార్‌లో అక్టోబర్ 21 నుంచి జరిగే జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం లేదని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ తెలిపింది. జాతీయ చాంపియన్‌షిప్ లో విజేతలుగా నిలిచిన వారిని మాత్రమే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేస్తారు. అయితే మేరీకోమ్ పాల్గొనే 48–51 కేజీల విభాగానికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) భావిస్తోంది.
చదవండి: ఇండియన్ వెల్స్ ఓపెన్‌లో చాంపియన్‌గా అవతరించిన క్రీడాకారిణి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమృతాంజన్ హెల్త్‌కేర్ బ్రాండ్ అంబాసిడర్లుగా నియామకం
ఎప్పుడు : అక్టోబర్ 18
ఎవరు : వెయిట్‌లిఫ్టర్ మీరాబాయ్ చాను, రెజ్లర్ బజరంగ్ పునియా
ఎందుకు : సంస్థ ఉత్పత్తులకు ప్రచారకర్తలుగా వ్యవహరించేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్