Skip to main content

Tennis: ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌లో చాంపియన్‌గా అవతరించిన క్రీడాకారిణి?

Paula Badosa, Cameron Norrie

ప్రతిష్టాత్మక ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్, ఏటీపీ మాస్టర్స్‌ సిరీస్‌ టోర్నీలో పౌలా బదోసా (స్పెయిన్‌), కామెరాన్‌ నోరి (బ్రిటన్‌) చాంపియన్స్‌గా అవతరించారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో అక్టోబర్‌ 18న జరిగిన మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పౌలా బదోసా 7–6 (7/5), 2–6, 7–6 (7/2)తో మాజీ నంబర్‌వన్‌ అజరెంకా (బెలారస్‌)పై గెలిచింది. తాజా గెలుపుతో బదోసా 14 స్థానాలు ఎగబాకి 27వ ర్యాంక్‌ నుంచి 13వ ర్యాంక్‌కు చేరుకుంది.

తొలి బ్రిటన్‌ ప్లేయర్‌...

పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో 26వ ర్యాంకర్‌ కామెరాన్‌ నోరి 3–6, 6–4, 6–1తో బాసిలాష్‌విలి (జార్జియా)పై గెలిచి ఈ టోర్నీ చరిత్రలో విజేతగా నిలిచిన తొలి బ్రిటన్‌ ప్లేయర్‌గా నిలిచాడు. చాంపియన్స్‌ బదోసా, నోరికి 12,09,730 డాలర్ల (రూ. 9 కోట్ల 11 లక్షలు) చొప్పున ప్రైజ్‌మనీ దక్కింది.
 

చ‌ద‌వండి:  థామస్‌ కప్‌ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన జట్టు?

క్విక్‌ రివ్యూ   :
ఏమిటి : ప్రతిష్టాత్మక ఇండియన్‌ వెల్స్‌ ఓపెన్‌ డబ్ల్యూటీఏ ప్రీమియర్‌ టోర్నీలో విజేతగా అవతరించిన క్రీడాకారిణి?
ఎప్పుడు : అక్టోబర్‌ 18
ఎవరు    : పౌలా బదోసా (స్పెయిన్‌)
ఎక్కడ    : కాలిఫోర్నియా, అమెరికా
ఎందుకు : మహిళల సింగిల్స్‌ ఫైనల్లో పౌలా బదోసా 7–6తో మాజీ నంబర్‌వన్‌ అజరెంకా (బెలారస్‌)పై విజయం సాధించడంతో...

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 19 Oct 2021 04:34PM

Photo Stories