Cricket: మహిళల వన్డే వరల్డ్‌కప్‌లో భారత జట్టుకు ఎవరు సారథ్యం వహించనున్నారు?
భారత మహిళల క్రికెట్ దిగ్గజం, హైదరాబాదీ మిథాలీ రాజ్ వరుసగా మూడో వన్డే వరల్డ్ కప్‌లో జట్టుకు సారథ్యం వహించనుంది. మిథాలీ నాయకత్వంలో మహిళల క్రికెట్ వన్డే వరల్డ్‌కప్–2022 బరిలోకి దిగే 15 మంది సభ్యుల భారత జట్టును సెలక్టర్లు జనవరి 6న ప్రకటించారు. హర్మన్‌ప్రీత్ కౌర్ టీమ్‌కు వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తుంది. 2022, మార్చి 4నుంచి ఏప్రిల్ 3 వరకు న్యూజిలాండ్ వేదికగా వరల్డ్ కప్ జరుగుతుంది. 2017లో మిథాలీ కెప్టెన్సీలోనే ఆడిన టీమ్ హోరాహోరీగా సాగిన ఫైనల్లో ఇంగ్లండ్ చేతిలో 9 పరుగులతో ఓడి రన్నరప్‌గా నిలిచిన విషయం విదితమే.
జట్టు వివరాలు: మిథాలీ రాజ్ (కెప్టెన్), హర్మన్‌ప్రీత్ కౌర్ (వైస్ కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, యస్తిక భాటియా, దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), తానియా భాటియా (వికెట్ కీపర్), స్నేహ్ రాణా, పూజ వస్త్రకర్, జులన్ గోస్వామి, మేఘనా సింగ్, రేణుకా సింగ్, పూనమ్ యాదవ్, రాజేశ్వరి గైక్వాడ్. స్టాండ్‌బై: సబ్బినేని మేఘన, ఏక్తా బిస్త్, సిమ్రన్ బహదూర్.
చదవండి: రాష్ట్రంలోని ఏ నగరంలో జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : మహిళల వన్డే వరల్డ్‌కప్–2022లో భారత జట్టుకు ఎవరు సారథ్యం వహించనున్నారు?
ఎప్పుడు : జనవరి 6
ఎవరు : భారత మహిళల క్రికెట్ దిగ్గజం, హైదరాబాదీ మిథాలీ రాజ్
ఎక్కడ : న్యూజిలాండ్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్