Andhra Pradesh: రాష్ట్రంలోని ఏ నగరంలో జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభమయ్యాయి?
జాతీయ కబడ్డీ పోటీలు చిత్తూరు జిల్లా, తిరుపతి నగరంలో జనవరి 5న ప్రారంభమయ్యాయి. ప్రారంభ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, బ్యాడ్మింటన్ కోచ్, పద్మభూషణ్ పుల్లెల గోపీచంద్, అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పాల్గొన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్, తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు జనవరి 9న ముగుస్తాయి.
‘శత వసంతాల ఘంటసాల’ పుస్తకావిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన ‘శత వసంతాల ఘంటసాల’ పుస్తకావిష్కరణ – విశ్లేషణ కార్యక్రమాన్ని విజయవాడ స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన పుస్తక మహోత్సవంలో జనవరి 5న నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పర్యాటక శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్.సత్యనారాయణ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
చదవండి: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆల్‌రౌండర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : జాతీయ కబడ్డీ పోటీలు ప్రారంభం
ఎప్పుడు : జనవరి 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, పద్మభూషణ్ అవార్డీ పుల్లెల గోపీచంద్, అర్జున అవార్డు గ్రహీత హోన్నప్ప గౌడ
ఎక్కడ : తిరుపతి, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్