Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆల్‌రౌండర్?
![Mohammad Hafeez](/sites/default/files/images/2022/01/04/mohammad-hafeez-1641287227.jpg)
పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. పూర్తి సంతృప్తితో క్రికెట్ కెరీర్‌ను ముగిస్తున్నందుకు గర్వపడుతున్నానని జనవరి 3న 41 ఏళ్ల హఫీజ్ పేర్కొన్నాడు.
2018లోనే టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు..
- టాపార్డర్ బ్యాటర్, ఆఫ్ స్పిన్ బౌలరైన హఫీజ్ 2018లోనే టెస్టు క్రికెట్‌కు బైబై చెప్పాడు.
- అన్ని ఫార్మాట్లలో కలిపి మొత్తం 392 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన హఫీజ్ 12,789 పరుగులు చేశాడు. 253 వికెట్లు తీశాడు. ఇందులో 55 టెస్టులు, 218 వన్డేలు, 119 టి20 మ్యాచ్‌లున్నాయి.
- మూడు వన్డే వరల్డ్‌కప్‌లు, ఆరు టి20 ప్రపంచకప్‌లు ఆడిన ఈ పాకిస్తాన్ క్రికెటర్ 2003లో జింబాబ్వేతో జరిగిన వన్డే ద్వారా అరంగేట్రం చేశాడు.
- 2021, నవంబర్‌లో జరిగిన టి20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో సెమీఫైనల్ మ్యాచ్ అతని కెరీర్‌లో చివరిది.
- తన కెరీర్‌లో పాకిస్తాన్ జాతీయ జట్టు మూడు ఫార్మాట్లకు నాయకత్వం వహించిన ఘనత హఫీజ్‌ది.
జోష్నా చినప్ప ఏ క్రీడలో ప్రసిద్ధి చెందినది?
ప్రొఫెషనల్ స్క్వాష్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) ప్రపంచ ర్యాంకింగ్స్‌లో భారత స్టార్ క్రీడాకారిణి జోష్నా చినప్ప మళ్లీ టాప్–10లోకి వచ్చింది. జనవరి 3న విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో 35 ఏళ్ల జోష్నా రెండు స్థానాలు ఎగబాకి 10వ ర్యాంక్‌లో నిలిచింది. తన 18 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో జోష్నా 417 మ్యాచ్‌లు ఆడి 246 విజయాలు సాధించింది. 21 టోర్నీలలో ఫైనల్‌కు చేరింది.
చదవండి: డోపింగ్‌లో పట్టుబడ్డ జాతీయ స్ప్రింట్ మహిళా చాంపియన్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆల్‌రౌండర్?
ఎప్పుడు : జనవరి 3
ఎవరు : పాకిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ హఫీజ్
ఎందుకు : వ్యక్తిగత కారణాలతో..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్