Dope Test: డోపింగ్‌లో పట్టుబడ్డ జాతీయ స్ప్రింట్ మహిళా చాంపియన్?
అండర్–23 విభాగంలో భారత జాతీయ స్ప్రింట్ మహిళా చాంపియన్ తరణ్‌జీత్ కౌర్ డోపింగ్ పరీక్షలో విఫలమైంది. ఈ విషయాన్ని జనవరి 1న జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) తెలిపింది. ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల తరణ్‌జీత్ 2020, సెప్టెంబర్‌లో జరిగిన జాతీయ అండర్–23 అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల విభాగాల్లో స్వర్ణ పతకాలు నెగ్గింది. ‘నాడా’ క్రమశిక్షణ కమిటీ విచారణలోనూ తరణ్‌జీత్ దోషిగా తేలితే ఆమెపై నాలుగేళ్ల నిషేధం విధిస్తారు.
ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి ఎక్కడ శంకుస్థాపన చేశారు?
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, మీరట్ జిల్లా, మీరట్‌లో జనవరి 2న మేజర్ ధ్యాన్‌చంద్ క్రీడా విశ్వవిద్యాలయానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. రూ. 700 కోట్లతో నిర్మించే ఈ వర్సిటీ 1,080 మంది బాల, బాలికలను మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దనుంది.
చదవండి: ప్రపంచ విశ్వవిద్యాలయాల క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న నగరం?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్