Skip to main content

National Record: 5000 మీటర్ల పరుగులో కొత్త రికార్డు నెలకొల్పిన ఆటగాడు?

Avinash Sable breaks 30-year-old 5000m national record in united staes of america
Avinash Sable breaks 30-year-old 5000m national record in united staes of america

భారత స్టార్‌ రన్నర్‌ అవినాశ్‌ సాబ్‌లె మరో రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అమెరికాలోని కాలిఫోర్నియాలో జరుగుతున్న సౌండ్‌ రన్నింగ్‌ ట్రాక్‌ ఈవెంట్లో అవినాశ్‌ 5000 మీటర్ల పరుగులో కొత్త జాతీయ రికార్డు సృష్టించాడు. ఈ రేసును 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసిన సాబ్‌లె.. 30 ఏళ్ల క్రితం బహుదూర్‌ ప్రసాద్‌ (13 నిమిషాల 29.70 సెకన్లు, బర్మింగ్‌హామ్‌ మీట్, 1992) నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. ఈ ఈవెంట్లో అవినాశ్‌ 12వ స్థానంలో నిలిచాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో జాతీయ రికార్డు (8 నిమిషాల 16:21 సెకన్లు) కూడా అవినాశ్‌ పేరిటే ఉంది.
 

Published date : 16 May 2022 08:03PM

Photo Stories