Asian Games sailing: సెయిలింగ్‌లో భారత్‌కు రజిత, కాంస్య పతకాలు
Sakshi Education
సముద్రంలో తెర చాపను నియంత్రిస్తూ ముందుకు దూసుకుపోవడమే సెయిలింగ్.
ఆసియా క్రీడల్లో మంగళవారం ఈ క్రీడాంశంలో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. భోపాల్‌కు చెందిన 17 ఏళ్ల నేహా ఠాకూర్ బాలికల డింగీ ఐఎల్‌సీఏ–4 ఈవెంట్‌లో రెండో స్థానం సంపాదించి రజత పతకం గెల్చుకుంది. అయోధ్యకు చెందిన 29 ఏళ్ల ఇబాద్ అలీ విండ్‌సర్ఫర్ ఆర్‌ఎస్:ఎక్స్ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు. 11 రేసులతో కూడిన డింగీ ఈవెంట్‌లో నేహా 32 పాయింట్లు స్కోరు చేయగా... 14 రేసులతో కూడిన విండ్‌సర్ఫర్ ఈవెంట్‌లో ఇబాద్ అలీ 52 పాయింట్లు సాధించాడు.
Published date : 27 Sep 2023 01:07PM