Skip to main content

Asian Games 2023 Freestyle Wrestling: పురుషుల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌లో రజతం

ఆసియా క్రీడల పురుషుల ఫ్రీస్టయిల్‌ రెజ్లింగ్‌ ఈవెంట్‌ను భారత్‌ రజత పతకంతో ముగించింది.
Asian Games 2023 Freestyle Wrestling
Asian Games 2023 Freestyle Wrestling

86 కేజీల విభాగంలో దీపక్‌ పూనియా భారత్‌కు రజత పతకాన్ని అందించాడు. ఇరాన్‌ దిగ్గజ రెజ్లర్‌ హసన్‌ యజ్దానితో జరిగిన ఫైనల్లో దీపక్‌ 3 నిమిషాల 31 సెకన్లలో 0–10తో ‘టెక్నికల్‌ సుపీరియారిటీ’ పద్ధతిలో ఓడిపోయాడు.

Asian Games 2023 Archery: ఆర్చరీ జ్యోతి ఖాతాలో మరో స్వ‌ర్ణం

రెజ్లింగ్‌ నిబంధనల ప్రకారం బౌట్‌లో పది పాయింట్ల ఆధిక్యం సాధించిన వెంటనే ఆ రెజ్లర్‌ను విజేతగా ప్రకటిస్తారు. అంతకుముందు దీపక్‌ తొలి రౌండ్‌లో 3–2తో షరిపోవ్‌ (ఖతర్‌)పై, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో 11–0తో రియాన్‌డెస్టా (ఇండోనేసియా)పై, క్వార్టర్‌ ఫైనల్లో 7–3తో షోటా సిరాయ్‌ (జపాన్‌)పై, సెమీఫైనల్లో 4–3తో షపియెవ్‌ (ఉజ్బెకిస్తాన్‌)పై గెలుపొందాడు. 

Asian Games 2023 Wrestling: రెజ్లింగ్‌లో కాంస్య పతకాలు

Published date : 09 Oct 2023 01:42PM

Photo Stories