Asian Games 2023: షాట్‌పుట్‌లో కిరణ్ బలియాన్‌కు కాంస్యం
Sakshi Education
సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఆసియా క్రీడల అథ్లెటిక్స్ మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో భారత్‌కు 72 ఏళ్ల తర్వాత మళ్లీ పతకం లభించింది.
శుక్రవారం జరిగిన షాట్‌పుట్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన 24 ఏళ్ల కిరణ్ బలియాన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. కిరణ్ ఇనుప గుండును 17.36 మీటర్ల దూరం విసిరింది.
Asian Games 2023: సాకేత్-రామ్ జోడికి రజతం
1951లో న్యూఢిల్లీ వేదికగా జరిగిన తొలి ఆసియా క్రీడల్లో మహిళల షాట్‌పుట్ క్రీడాంశంలో ఆంగ్లో ఇండియన్ బార్బరా వెబ్‌స్టర్ కాంస్య పతకం గెల్చుకుంది. ఆ తర్వాత ఈ క్రీడాంశంలో కిరణ్ బలియాన్ రూపంలో భారత్‌కు రెండో పతకం లభించడం విశేషం. లిజియావో గాంగ్ (చైనా; 19.58 మీటర్లు) స్వర్ణం... జియాయువాన్ సాంగ్ (చైనా; 18.92 మీటర్లు) రజతం సాధించారు.
Published date : 30 Sep 2023 06:08PM