Skip to main content

Zombie Virus: మళ్లీ తెరపైకి జాంబీ వైరస్‌!

ప్రమాదకరమైన జాంబీ వైరస్‌. రష్యాలో అతి శీతల ప్రాంతమైన సైబీరియాలోని ఓ సరస్సులో 48,500 ఏళ్లుగా మంచు పలకల నడుమ గడ్డకట్టిన స్థితిలో నిద్రాణంగా పడి ఉంది.

దాన్ని శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. ఒకరి నుంచి ఇంకొకరికి సోకే లక్షణమున్న ఈ వైరస్‌ కరోనాను మించిన పెను ఆరోగ్య విపత్తుకు దారి తీయొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు, ఇలాంటి దాదాపు రెండు డజన్ల పురాతన వైరస్‌లను శాస్త్రవేత్తలు ఇటీవలి కాలంలో గుర్తించారు. గ్లోబల్‌ వార్మింగ్‌ దెబ్బకు నిత్యం సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలుండే ప్రాంతాల్లో కూడా మంచు పలకలు వేగంగా కరిగిపోతుండటం తెలిసిందే. దాంతో ఇంతకాలంగా వాటి కింద నిద్రాణంగా ఉన్న ఇలాంటి ప్రమాదకర వైరస్‌లెన్నో ఒళ్లు విరుచుకుని మానవాళిపైకి వచ్చి పడతాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ శాస్త్రవేత్తల బృందమే 2013లో ఇలాగే 30 వేల ఏళ్ల నాటి వైరస్‌లను వెలుగులోకి తెచ్చింది. ఇప్పుడు తన రికార్డును తానే అధిగమిస్తూ పండోరా వైరస్‌ ఎడొమాగా పేర్కొనే జాంబీ వైరస్‌ను కనిపెట్టిందని బ్లూంబర్గ్‌ నివేదిక పేర్కొంది.

మరణమృదంగం.. ఐదు బ్యాక్టీరియాలకు.. 77 లక్షల మంది బలి

Published date : 01 Dec 2022 04:00PM

Photo Stories