Lunar Resources: చంద్రుడిపై ఆక్సిజన్ పైప్‌లైన్ !
Sakshi Education

భవిష్యత్తులో తాము చేపట్టబోయే ఆర్టెమిస్ మిషన్ల కోసం చంద్రుడి దక్షిణ ధ్రువం చుట్టుపక్కల ప్రాంతాలకు ఆక్సిజన్ సరఫరా కోసం పైప్‌లైన్ వేసే ప్రతిపాదనను నాసా పరిశీలిస్తోంది. రోవర్ల ద్వారా ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రస్తుతం నాసా వద్దనున్న ప్రణాళికలతో ఇబ్బందులు ఎదురవుతాయని, కాబట్టి పైప్‌లైన్ వేయడం ఉత్తమమని లూనార్ రిసోర్సెస్ సంస్థ సూచించింది. దీంతో మంచు వెలికితీత కేంద్రం వద్ద ఈ పైప్‌లైన్ వేయాలనే ఆలోచనతో నాసా ఉంది. ఒకవేళ ఈ ప్రతిపాదన అమలైతే భవిష్యత్తులో వ్యోమగాములకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
Published date : 23 Jan 2023 04:11PM