Skip to main content

Nonorocks ISS : అంతరిక్షంలో తయారయ్యే వ్యర్థాలకు చెక్‌..!

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో తయారయ్యే వ్యర్థాలను భూమిపైకి తేకుండా అంతరిక్షంలోనే మండించే కొత్త పరికరాన్ని హూస్టన్‌కు చెందిన నానో ర్యాక్స్‌ అనే ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ తయారు చేసింది.
బిషప్స్‌ ఎయిర్‌లాక్‌
Nonorocks ISS

బిషప్స్‌ ఎయిర్‌లాక్‌ అనే ఈ పరికరంలో ఒకేసారి 600 పౌండ్లు, సుమారు 272 కిలోల చెత్తను ఉంచి కాల్చవచ్చు. ఐఎస్‌ఎస్‌లో ఆస్ట్రోనాట్‌ల వల్ల ఏడాదికి 2,500 కిలోల వ్యర్థాలు తయారవుతున్నాయి. ఈ వ్యర్థాలను ఐఎస్‌ఎస్‌కు అవసరమైన సామగ్రి రవాణాకు ఉపయోగించే సిగ్నస్‌ కార్గో వెహికల్‌ ద్వారా భూమిపైకి పంపిస్తున్నారు. ఇందుకు సమయం పడుతోంది. కానీ, బిషప్స్‌ ఎయిర్‌ లాక్‌ వ్యర్థాలను ఎప్పటికప్పుడు వెలుపలి అంతరిక్షంలోనే మండించి, తిరిగి ఐఎస్‌ఎస్‌కు చేరుకుంటుంది. దీనిని విజయవంతంగా పరీక్షించినట్లు నానోర్యాక్స్‌ తెలిపింది.

చ‌ద‌వండి: Quiz of The Day(July 14, 2022) >> ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయాలు, ఎన్నికలలో పాల్గొనడాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది?

డౌన్‌లోడ్‌ చేసుకోండి: 
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్‌ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్‌) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్‌ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్‌ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్‌ చేసుకోండి.

యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా...
డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Published date : 15 Jul 2022 06:36PM

Photo Stories