China Experiment : చరిత్ర సృష్టించిన చాంగే–6
Sakshi Education
చంద్రుని ఆవలి భాగం ఉపరితలాన్ని పరిశోధించేందుకు గత నెలలో చైనా ప్రయోగించిన ‘చాంగే–6’ లూనార్ ప్రోబ్ అక్కడి మట్టి నమూనాలను తీసుకుని విజయవంతంగా భూమికి తిరిగొచ్చింది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియా ప్రాంతంలో జూన్ 25న మధ్యాహ్నం 2 గంటల 7 నిమిషాలకు చాంగే–6 రిటర్న్ క్యాప్సూల్ ల్యాండ్ అయినట్టు చైనా జాతీయ ఖగోళ పరిశోధన సంస్థ (సీఎన్ ఎస్‌ఏ) వెల్లడించింది. దీంతో చంద్రుని ఆవలి భాగం మట్టి నమూనాలను భూమికి తీసుకొచ్చిన తొలి దేశంగా చైనా రికార్డులకెక్కింది. ఇప్పటివరకు దక్షిణ ధృవాన్ని ఏ దేశం అన్వేషించలేదు. ‘చాంగే–6’ లూనార్ ప్రోబ్ మే నెల 3న భూమి నుంచి బయల్దేరి జూన్ 2న చంద్రుని దక్షిణ ధృవంలోని అయిట్కిన్ (ఎస్‌పీఏ) బేసిన్ లో దిగింది.
Published date : 03 Jul 2024 03:49PM