Astronomy: జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను నిర్మించిన సంస్థ?
మానవాళి ప్రతిష్టాత్మకంగా భావించే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తన గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకొంది. భూమి, సూర్యుడికి మధ్యన ఉండే ఎల్2 పాయింట్ (లాంగ్రేజియన్ 2 పాయింట్)ను చేరినట్లు నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) వర్గాలు తెలిపాయి. ఎల్2 పాయింట్ భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంది, ఈ పాయింట్‌లో ఇకపై వెబ్ టెలిస్కోప్ పరిభ్రమణ జరుపుతుంది. 2022 జూలై నుంచి టెలిస్కోపు నుంచి రీడింగ్స్ భూమికి రావడం ఆరంభమవుతుంది. ఈలోపు టెలిస్కోపు తనను తాను కక్ష్యలో సర్దుబాటు చేసుకోవడం, దర్పణాలు సమలేఖణం(అలైన్‌మెంట్) చెందడం వంటి పనులు పూర్తి చేయాల్సిఉంది.
విశ్వ ఆవిర్భావ రహస్యాల శోధన లక్ష్యంగా జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నిర్మాణం జరిగింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా స్పేస్ ఏజెన్సీల సహకారంతో నాసా ఈ టెలిస్కోపును అభివృద్ది చేసింది. దాదాపు 20కి పైగా దేశాలకు ఈ టెలిస్కోపు నిర్మాణంలో భాగస్వామ్యం ఉంది. 2021, డిసెంబర్ 25వ తేదీన దీన్ని నింగిలోకి పంపారు.
చౌకైన కోవిడ్ ‘స్మార్ట్’ టెస్ట్
కరోనా నిర్ధారణ పరీక్షలు, ఫలితాల కోసం నిరీక్షించాల్సిన అవసరం లేకుండా స్మార్ట్ ఫోన్ డయాగ్నస్టిక్ టూల్‌ను అమెరికా అధ్యయనకారులు కనిపెట్టారు. సార్స్ కోవిడ్ 2 జన్యు పదార్థం నుంచి దీనిని రూపొందించినట్లు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ తెలిపింది. ఆర్టీపీసీఆర్ టెస్టు తరహాలోనే పని చేసే ఈ టూల్ 97 శాతం కచ్చితమైన ఫలితాలను ఇస్తుందని పరిశోధకులు తెలిపారు. 20 నిమిషాల్లో ఫలితాలు తెలుస్తాయని పేర్కొన్నారు.
చదవండి: వికాస్ ఇంజన్ సామర్థ్య పరీక్ష విజయవంతం
క్విక్ రివ్యూ :
ఏమిటి : జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తన గమ్యస్థానానికి సురక్షితంగా చేరుకొంది
ఎప్పుడు : జనవరి 25
ఎవరు : నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా)
ఎక్కడ : భూమి, సూర్యుడికి మధ్యన ఉండే ఎల్2 పాయింట్ (లాంగ్రేజియన్ 2 పాయింట్)కు..
ఎందుకు : విశ్వ ఆవిర్భావ రహస్యాల శోధన లక్ష్యంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్