Skip to main content

MSG Sphere in Las Vegas: ఈ స్పియర్‌తో కొత్త‌ అనుభూతి

సినిమాలు చూసేందుకు థియేటర్‌కు వెళ్తుంటాం.. 3డీలో చూసే సినిమాల కోసం స్పెషల్‌ 3డీ గ్లాసెస్‌ ఇస్తుంటారు. కానీ ఇక్కడ చెప్పుకునే ఓ థియేటర్‌లాంటి వేదికలో మాత్రం ఎటువంటి అద్దాల అవసరం లేకుండానే ఏకంగా 4డీ ఎక్స్‌పీరియన్స్‌ వస్తుంది. లోపలే కాదు బయట కూడా ఈ వేదిక రంగులు వెదజిమ్ముతూ ఆకట్టుకుంటోంది. 
MSG Sphere in Las Vegas,Interior of World's Largest Spherical Building with LED Screens
MSG Sphere in Las Vegas

ప్రపంచంలోనే అతి పెద్ద గోళాకారంలో నిర్మించిన ఈ భవంతి పేరు ద స్పియర్‌. దీని పై, లోపలి భాగాల్లో విశాలమైన ఎల్‌ఈడీ స్క్రీన్లను ఫిక్స్‌ చేశారు. ఎల్‌ఈడీ స్క్రీన్ల వెలుగులతో భవంతి ఆకర్షణీయంగా కనిపిస్తోంది. లోపల ఏర్పాటు చేసిన తెరమీద ఏదైనా వీడియో ప్లే చేస్తుంటే మనం కూడా ఆ వీడియోలో ఉన్న ప్రదేశంలో ఉన్నామేమో అన్న అనుభూతి కలిగేలా స్క్రీన్ల అమరిక ఉంది.

16 Psyche asteroid: టన్నుల కొద్దీ బంగారం ఉన్న‌ గ్రహశకలంలో ఏంటో తెలుసా!

ఈ మధ్యే ఈ స్పియర్‌ను ప్రారంభించగా అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వేదిక అసలు పేరు ఎమ్‌ఎస్‌జీ స్పియర్‌. ఇది అమెరికాలో లాస్‌ వెగాస్‌కు సమీపంలోని ప్యారడైజ్‌లో ఉంది. ఏదైనా షోలు, కచేరీలు, ఈవెంట్లు జరుపుకోవడానికి ఇది ఎంతో అనువుగా ఉంటుంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇది ఎంటర్‌టైన్‌మెంట్‌కు పర్ఫెక్ట్‌ చాయిస్ అని చెప్పుకోవచ్చు.

స్పియర్‌కు సంబంధించి మరిన్ని ఆసక్తికర విషయాలు

► పాపులస్‌ అనే సంస్థ దీని రూపకల్పనకు నడుం బిగించింది.
► దీని ఎత్తు 366 అడుగులు, వెడల్పు 516 అడుగులు.
► 18,600 సీట్ల సామర్థ్యం కలదు.
► వేదిక వెలుపలి భాగంలో 5,80,000 చదరపు అడుగుల ఎల్‌ఈడీ స్క్రీన్లు ఉన్నాయి.
► వేవ్‌ఫీల్డ్‌, సింథసిస్‌ టెక్నాలజీతో ఉన్న స్పీకర్స్‌.. 16కె రిజల్యూషన్‌ స్క్రీన్‌ క్వాలిటీ, 4డీ ఎఫెక్స్ట్‌ దీని ప్రత్యేక స్పెషాలిటీ.
► ఈ వేదికను నిర్మించడానికి అయిన ఖర్చు 2.3 బిలియన్‌ డాలర్స్‌ (భారతదేశ కరెన్సీ ప్రకారం రూ.19 వేల కోట్ల పైమాటే)

Dark Earth: భూమిపై డార్క్ ఎ‍ర్త్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు

Published date : 19 Oct 2023 10:45AM

Photo Stories