Japan successfully launched the Moon Lander: మూన్ ల్యాండర్‌ను విజయవంతంగా ప్రయోగించిన జపాన్
Sakshi Education
జపాన్ చంద్రునిపై పరిశోధన కోసం మూన్ ల్యాండర్‌ను విజయవంతంగా ప్రయోగించింది.
జపాన్ ఏరోస్పేస్ ఎక్స్‌ప్లోరేషన్ ఏజెన్సీ (జాక్సా) స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్ (SLIM) అనే మూన్ ల్యాండర్‌ను, ఎక్స్-రే ఇమేజింగ్, స్పెక్ట్రోస్కోపీ మిషన్ (XRISM) అనే స్పెక్ట్రోస్కోప్‌ను సెప్టెంబర్ 7న ఉదయం 8:42 JST (5:12 am IST)కి తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది.
Chandrayaan-3 Success: చంద్రయాన్–3 ప్రయోగం సక్సెన్
XRISM ఒక ఎక్స్-రే టెలిస్కోప్, SLIM అనేది మూన్ ల్యాండర్. XRISM, SLIM వ్యోమనౌకలు ఫిబ్రవరి 2024లో చంద్రుడుని చేరుకోవచ్చునని భావిస్తున్నారు. ఈ మిషన్‌కి మూన్ స్నైపర్‌గా నామకరణం చేశారు. మూన్ స్నైపర్ మిషన్ జపాన్ మూడవ మూన్ మిషన్. ఈ మిషన్ కోసం జపాన్ 100 మిలియన్ల డాలర్లను ఖర్చు చేసింది.
Chandrayaan-3: జయహో భారత్... చంద్రయన్-3 ప్రయోగం సూపర్ సక్సెస్
Published date : 08 Sep 2023 10:56AM