ISRO: సెమీ–క్రయోజనిక్ పరీక్ష విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) భవిష్యత్తులో ప్రయోగించబోయే వాహనాల్లో వినియోగించనున్న సెమీ–క్రయోజనిక్ ఇంజన్ ను విజయవంతంగా పరీక్షించింది. తమిళనాడు మహేంద్రగిరిలోని ఇస్రో పొపల్షన్ కాంప్లెక్స్(ఐపీఆర్‌సీ)లో ఇంటర్మీడియట్ కాన్ఫిగరేషన్ పై 2000 కిలోన్యూటన్ సెమీ–క్రయోజనిక్ ఇంజన్ మొదటి ఇంటిగ్రేటెడ్ పరీక్ష నిర్వహించినట్లు బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం ప్రకటించింది. భవిష్యత్తులో ప్రయోగించే వాహనాల కోసం లిక్విడ్ ఆక్సిజన్ (ఎల్‌వోఎక్స్), కిరోసిన్ ప్రొపెల్లెంట్‌ల కలయికతో పనిచేసే 2వేల కేఎన్ థ్రస్ట్ ఇంజన్ ను అభివృద్ధి చేయడంలో ఇది మొదటి అడుగుగా పేర్కొంది. పవర్ హెడ్‌టెస్ట్ ఆర్టికల్(పీహెచ్‌టీఏ)గా పిలిచే ఈ ఇంటర్మీడియట్ కాన్ఫిగరేషన్ లో థ్రస్ట్‌చాంబర్ మినహా ఇతర అన్ని ఇంజన్ సిస్టమ్‌లు ఉంటాయి. తక్కువ పీడన, అధిక పీడన టర్బోపంప్‌లు, గ్యాస్‌జనరేటర్లు, నియంత్రణ విభాగాలతో సహా ప్రొపెల్లెంట్ ఫీడ్ సిస్టమ్ రూపకల్పనను ధ్రువీకరించే పరీక్షల సిరీస్‌లో ఇది మొదటిదని వివరించింది. ఈ పరీక్ష 15 గంటల పాటు కొనసాగిందని, ఈ సమయంలో ఇంజన్ ప్రారంభం కావడానికి అవసరమైన అన్ని దశలను విజయవంతంగా పూర్తి చేసిందని, భావి పరీక్షలకు ఇది ఒక కీలక మైలురాయి అని ఇస్రో తెలిపింది.
>> Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP