PSLV-C55: నింగికెగిసిన PSLV-C55... చరిత్ర లిఖించిన ఇస్రో
Sakshi Education
శ్రీహరికోట షార్(సతీష్ ధావన్ స్పేస్‌సెంటర్) నుంచి పీఎస్‌ఎల్‌వీ-సీ 55 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ISRO ఇస్రో నిర్వహించిన ఈ ప్రయోగం శనివారం మధ్యాహ్నం జరగ్గా.. రెండు విదేశీ ఉపగ్రహాలను నింగిలోకి విజయవంతంగా మోసుకెళ్లి కక్ష్యలోకి ప్రవేశపెట్టింది వాహననౌక. దీంతో షార్ కంట్రెల్ సెంటర్‌లో స్పేస్ శాస్త్రవేత్తలు సంబురాల్లో మునిగిపోయారు. రాకెట్ ప్రయోగం కౌంట్‌డౌన్ ప్రక్రియ ఇస్రో చైర్మన్ సోమనాథ్ పర్యవేక్షించారు. 20.35 నిమిషాల ప్రయాణం తర్వాత కక్ష్యలోకి ప్రవేశించాయి శాటిలైట్స్.
ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 741 కిలోల బరువు కలిగిన టెలియోస్-2, 16 కేజీల బరువు ఉన్న లూమిలైట్-4 ఉపగ్రహాంను సన్ సింక్రనస్ ఆర్బిట్(సూర్యానువర్తన ధ్రువ కక్ష్య)లోకి ప్రవేశట్టింది రాకెట్. పీఎస్‌ఎల్‌వీ-సీ 55 రాకెట్.. బరువు 44.4 మీటర్ల పొడవు. 228 టన్నుల బరువు. సముద్ర భద్రతను పెంచడం కోసం లూమిలైట్‌ను ప్రవేశపెట్టింది సింగపూర్. ఇప్పటివరకు 424 ఉపగ్రహాలను ప్రయోగించింది ఇస్రో. పీఎస్‌ఎల్‌వీ సిరీస్‌లో ఇది 57వ రాకెట్.
చదవండి: కానిస్టేబుల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ వాయిదా... కొత్త తేదీలు విడుదల చేసిన సీఆర్‌పీఎఫ్
Published date : 22 Apr 2023 03:05PM