GSLV F-12 Rocket: జీఎస్‌ఎల్‌వీ ఎఫ్-12 రాకెట్ ప్రయోగం విజయవంతం
మే 29న ఉదయం సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ కేంద్రంలోని సెకండ్ లాంచ్ ప్యాడ్ నుంచి సరిగ్గా 10:42 గంటలకు నిప్పులు చెరుగుతూ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ఆపై నిర్ణీత సమయంలో ఎన్‌వీఎస్ - 01 ఉపగ్రహాన్ని రాకెట్ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. రాకెట్ విజయవంతంతో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ ఉపగ్రహం దేశీయ నేవిగేషన్ సేవలు అందించనుంది. జీఎస్ఎల్వీ ఎఫ్ - 12 రాకెట్ పొడవు 51.7 మీటర్లు, బరువు 420 టన్నులు. 2,232 కిలోల బరువున్న ఎన్‌వీఎస్-01 జీవితకాలం 12 ఏళ్లు.
ఈ ప్రయోగం విజయవంతం కావడంతో.. పూర్తి స్థాయిలో స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. పన్నెండేళ్ల పాటు సదరు ఉపగ్రహం సేవలు అందించనుంది. త్వరలో నావిక్ పేరుతో దేశీయ నావిగేషన్ సేవలు ప్రారంభం కానున్నాయి. జియో సింక్రోనస్ లాంచింగ్ శాటిలైట్ వెహికల్ (జీఎస్‌ఎల్‌వీ) ఎఫ్12 ద్వారా 2,232 కిలోల బరువు కలిగిన NVS (నావిక్)–01 ఉపగ్రహాన్ని రోదసిలోకి ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగ పనులను ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షించారు.
Chandrayaan 3: జులైలో అంతరిక్షంలోకి చంద్రయాన్ 3..!
రీజనల్ ఘనత కోసం..
నావిగేషన్ శాటిలైట్ సిస్టం బలోపేతం కోసం భారత క్షేత్రీయ దిక్సూచి ఉపగ్రహ వ్యవస్థ (ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టం) వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు నావిక్–01 పేరుతో నావిగేషన్ ఉపగ్రహ ప్రయోగాన్ని నిర్వహించారు. నావిక్–01 ఉపగ్రహం సరికొత్తగా ఎల్–5, ఎస్–బాండ్‌ల సిగ్నల్స్‌తో పనిచేసే విధంగా రూపొందించారు. ఈ ఉపగ్రహం వల్ల భూమి, జల, వాయు మార్గాల స్థితిగతులు, దిక్కులు తెలియజేయడం, ఆపద సమయాల్లో భూగోళానికి సంబంధించిన సమాచారం అందించడం, వాహనచోదకులకు దిశానిర్దేశం చేయడం, ఇంటర్నెట్‌తో అనుసంధానం లాంటి ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. భారత విమానయాన, నౌకాయాన మార్గాలకు, సైనిక అవసరాలకు కూడా దోహదపడనుంది.
వీక్లీ కరెంట్ అఫైర్స్ (Science & Technology) క్విజ్ (07-13 మే 2023)