Skip to main content

Chandrayaan 3: జులైలో అంత‌రిక్షంలోకి చంద్ర‌యాన్ 3..!

కొన్నేళ్లుగా భార‌త అంత‌రిక్ష సంస్థ(ఇస్రో) వ‌రుస విజ‌యాలు సాధిస్తోంది. అంచ‌నాల‌ను మించి స‌త్తా చాటుతోంది. ఇప్ప‌టికే చంద్ర‌యాన్ ప్రాజెక్టుతో భార‌త ప‌తాకాన్ని విశ్వ‌వ్యాప్తం చేసిన ఇస్రో ఇప్పుడు చంద్ర‌యాన్ 3ని విజ‌య‌వంతంగా అంత‌రిక్షంలోకి ప్ర‌వేశ‌పెట్టేందుకు సిద్ధ‌మైంది.
Chandrayaan-3
Chandrayaan-3

ముందుగా నిర్ణ‌యించుకున్న ల‌క్ష్యం మేర‌కు ఈ జులైలోనే ప్ర‌యోగాన్ని చేప‌ట్టేందుకు ఇస్రో స‌న్నాహాలు చేస్తోంది.

చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ ను ల్యాండ్ చేయడానికి అత్యంత క్లిష్టమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో చంద్ర‌యాన్‌ ప్రయోగాన్ని నిర్వ‌హించ‌నున్నారు. చంద్రుడిపై భూకంపాలు, చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా వాతావరణాన్ని పరిశీలించేందుకు సైన్స్ పరికరాలను చంద్రయాన్ -3 మిషన్ ద్వారా జాబిల్లి పైకి పంపనున్నారు.

☛➤☛ నింగికెగిసిన PSLV-C55... చ‌రిత్ర లిఖించిన ఇస్రో

Isro

ఇప్ప‌టివ‌ర‌కు చంద్రయాన్‌-3 వ్యోమనౌక ప్ర‌యోగానికి అవ‌స‌ర‌మైన‌ కీలక పరీక్షలు అన్నీ పూర్తి చేసుకుంది. నింగిలోకి దూసుకెళ్లే సమయంలో కంపనం, ధ్వనికి సంబంధించి ఎదురయ్యే కఠిన సవాళ్లను తట్టుకునే సామర్థ్యాన్ని విజయవంతంగా ధ్రువీకరించింది. బెంగళూరులోని యు.ఆర్‌.రావు కేంద్రంలో మార్చి మొదటివారంలో ఈ పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుత పరీక్షలు ప్రయోగానికి అవసరమైన పూర్తి విశ్వాసాన్ని ఇచ్చిన‌ట్లు ఇస్రో ఇప్ప‌టికే ప్ర‌క‌టించింది. ఈ జులై రెండో వారంలో ప్రొపల్షన్‌, ల్యాండర్‌, రోవర్‌ మాడ్యూళ్లతో కూడిన చంద్రయాన్‌-3 వ్యోమనౌక చంద్రుని వద్దకు ప్రయాణాన్ని ప్రారంభించే అవకాశముంది.

Isro

☛➤☛ ఇస్రోలో 65 సైంటిస్ట్‌/ఇంజనీర్‌ పోస్టులు.. ఎంపిక విధానం ఇలా‌..

భారత్ చేపట్టనున్న మూడో లూనార్ మిషనే చంద్రయాన్ 3. అలాగే ఏ ఏడాదే మొదటి సౌర మిషన్ ఆదిత్య ఎల్ - 1 (Aditya L 1) ప్రయోగాన్ని చేప‌ట్టనుంది. చంద్రయాన్ - 3 క్రాఫ్ట్‌ను పూర్తిగా సిద్ధం చేసిన అధికారులు... ప్ర‌యోగానికి అవ‌స‌ర‌మైన తుది ప‌రీక్ష‌లు చేప‌డుతున్నారు. అన్నీ అనుకున్న‌ట్లుగా సాగితే మ‌రో రెండు నెల‌ల్లో అంత‌రిక్షంలో భార‌త త్రివ‌ర్ణ ప‌తాకం మ‌రోసారి రెప‌రెప‌లాడ‌నుంది.

Published date : 19 May 2023 06:41PM

Photo Stories