Covid-19: ఐహెచ్‌యూ వేరియంట్ ఏ దేశంలో బయటపడింది?
ఐరోపా దేశం ఫ్రాన్స్‌లో కరోనా మరో వేరియంట్ బయటపడింది. ఈ కొత్త వేరియంట్‌తో 12 కేసులు నమోదైనట్లు గుర్తించారు. ఇన్‌స్టిట్యూట్ ఐహెచ్‌యూ మెడిటరేరియన్ ఇన్‌ఫెక్షన్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు దీన్ని కనుగొన్నారు. దీనికి తాత్కాలికంగా ఐహెచ్‌యూ (బీ. 1. 640.2) అని పేరుపెట్టారు. దీనిపై జరిపిన అధ్యయన వివరాలను మెడ్‌ఆర్‌ఎక్స్‌ఐవీలో ప్రచురించారు. ఐహెచ్‌యూ వేరియంట్‌లో 46 మ్యుటేషన్లు జరిగాయని వీటిలో 37 డిలీషన్లు(మ్యుటేషన్లలో ఒకరకం) ఉన్నాయని అధ్యయనం వెల్లడించింది.
ఆఫ్రికాకు చెందిన కామెరూన్ నుంచి వచ్చిన వారివల్ల ఐహెచ్‌యూ వ్యాప్తిలోకి వచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీని ప్రవర్తనపై ఎలాంటి అంచనాలు లేవని, క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరమే దీనిపై ఒక అవగాహనకు రావాలని నిపుణులు అభిప్రాయపడ్డారు.
ఒకేరోజు అత్యధిక కేసులు ఏ దేశంలో నమోదయ్యాయి?
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయ తాండవం చేస్తోంది. ఒమిక్రాన్ ఒక సునామీలా దేశాన్ని కుదిపేస్తోంది. 24 గంటల్లో 10 లక్షలకు పైగా కేసులు నమోదు కావడం భయోత్పాతాన్ని సృష్టిస్తోంది. చైనాలోని వూహాన్‌లో తొలిసారి బయల్పడిన కరోనా మహమ్మారి ఈ స్థాయిలో విజృంభించడం ఇదే మొదటిసారి. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం 2022, జనవరి 3న ఒక్క రోజే అమెరికాలో 10,82,549 కేసులు నమోదయ్యాయి.
చదవండి: ఒమిక్రాన్‌పై మూడో డోస్ ఎంత శాతం ప్రభావం చూపిస్తుంది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : కరోనా మరో వేరియంట్ ఐహెచ్‌యూ (బీ. 1. 640.2) ఏ దేశంలో బయటపడింది?
ఎప్పుడు : జనవరి 4
ఎవరు : ఇన్‌స్టిట్యూట్ ఐహెచ్‌యూ మెడిటరేరియన్ ఇన్‌ఫెక్షన్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు
ఎక్కడ : ఫ్రాన్స్
ఎందుకు : ఆఫ్రికాకు చెందిన కామెరూన్ నుంచి వచ్చిన వారివల్ల ఐహెచ్‌యూ వ్యాప్తిలోకి ఉండొచ్చని అనుమానం.
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్