First 3D Printed Post Office: దేశంలో తొలి 3డీ ప్రింటెడ్ పోస్టాఫీసు
Sakshi Education
దేశంలోనే మొట్ట మొదటి త్రీడీ ప్రింటెడ్ పోస్టాఫీసు బెంగళూరులో రూపుదిద్దుకుంది.
కంప్యూటరైజ్డ్ 3డీ మోడల్ డ్రాయింగ్ ఇన్‌పుట్ ఆధారంగా కాంక్రీట్‌ను ఒక్కో పొరగా వేసే 3డీ ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించి రోబోటిక్ ప్రింటర్‌తో ఇది నిర్మితమైంది. నగరంలోని కేంబ్రిడ్జి లేఔట్‌లో 1,021 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.40 లక్షలతో దీనిని నిర్మించారు. ఈ కొత్త పోస్టాఫీసును కేంద్ర రైల్వేలు, కమ్యూనికేషన్లు, ఎల్రక్టానిక్స్ ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ శుక్రవారం ప్రారంభించారు. సంప్రదాయ విధానంలో ఇటువంటి భవన నిర్మాణానికి ఆరు నుంచి 8 నెలలవరకు పడుతుంది. కానీ, ఆధునాతన పద్ధతిలో అంతా కలిపి కేవలం 45 రోజుల్లోనే నిర్మాణం పూర్తి చేసుకుంది. మద్రాస్ ఐఐటీ సాంకేతిక మార్గదర్శకంలో నిర్మాణ సంస్థ లార్సెన్ అండ్ టూబ్రో లిమిటెడ్ దీనిని నిర్మించింది.
Digital India project: డిజిటల్ ఇండియా ప్రాజెక్టు పొడిగింపునకు ఆమోదం
Published date : 19 Aug 2023 01:21PM