Tesla Robo ‘ఆప్టిమస్’
దీనికి అప్టిమస్ అని నామకరణం చేశారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో పాలో అల్టోలో ఉన్న టెస్లా కార్యాలయంలో సెప్టెంబర్ 30న రాత్రి ఈ మరమనిషిని ప్రదర్శించారు. వేదికపై వెనక్కి, ముందుకు నడుస్తూ నాట్యం చేస్తూ ఆహూతులను అలరించింది. వేదికపై తన యజమానికి, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కు అభివాదం చేసింది. ఇది ప్రోటోటైప్ హ్యూమనాయిడ్ రోబో అని టెస్లా వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నామని వెల్లడించాయి. దీన్ని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని పేర్కొన్నాయి. వైర్లతో అనుసంధానం లేకుండా వేదికపై డ్యాన్స్ చేసిన తొలి రోబో బహుశా ఇదే కావొచ్చని ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. ఇకపై ఆప్టిమస్ రోబోలను విక్రయిస్తామని, ఒక్కోటి 20 వేల డాలర్లకు కొనుగోలు చేయొచ్చని సూచించారు. అంటే కొన్ని రకాల టెస్లా కార్ల కంటే దీని ధర తక్కువే. వచ్చే మూడు–ఐదేళ్లలో ఆర్డర్లు తీసుకుంటామని మస్క్ తెలిపారు.