ENCORE Software: ఎన్నికల నిర్వహణ కోసం 'ఎన్‌కోర్' సాఫ్ట్‌వేర్
Sakshi Education
భారత ఎన్నికల సంఘం 'ఎన్‌కోర్' పేరుతో ఒక అంతర్గత సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసింది.
Election Commission Designed ENCORE Software
ఈ సాఫ్ట్‌వేర్ రియల్ టైమ్ ఎన్విరాన్‌మెంట్‌పై కమ్యూనికేషన్‌లను ప్రారంభించనుంది. ఎన్‌కోర్ సాఫ్ట్‌వేర్ సమర్థవంతమైన అభ్యర్థి, ఎన్నికల నిర్వహణ కోసం రూపొందించబడిన సాఫ్ట్‌వేర్ సూట్. ఈ సాఫ్ట్‌వేర్ ఎన్నికల సమయంలో కార్యకలాపాలు సజావుగా జరిగడం కోసం అనేక రకాల ఫీచర్లను అందిస్తోంది.
ఎన్‌కోర్ రిటర్నింగ్ అధికారులకు వివిధ రకాల ఎన్నికల విధులను నిర్వహించడానికి, అభ్యర్థి నామినేషన్ నుంచి ఓటర్ ట్రాకింగ్, ఓట్ల లెక్కింపు, ఫలితాలు, డేటా నిర్వహణ వరకు సమగ్ర వేదికను అందించనుంది.