Drone highways: డ్రోన్ల కోసం ఆకాశంలో ‘హైవే’
ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా యూకేలో డ్రోన్ల కోసం ప్రత్యేకంగా ‘సూపర్ హైవే’ను ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా అత్యాధునిక టెక్నాలజీ‘డీఏఏ (డిటెక్ట్ అండ్ అవాయిడ్)’ వినియోగించనున్నాయి. యూకే ఆగ్నేయ ప్రాంతంలో 265 కిలోమీటర్ల పొడవున ‘డ్రోన్ సూపర్ హైవే’ను ఏర్పాటు చేసేందుకు యూకే ప్రభుత్వం ఇటీవల అనుమతులు మంజూ రు చేసింది. కీలక నగరాలైన రీడింగ్, ఆక్స్‌ఫర్డ్, మిల్టన్ కీన్స్, కేంబ్రిడ్జ్, కొవెంట్రీ, రగ్బీ నగరాల మీదుగా ఈ డ్రోన్ హైవే సాగనుంది. 2024 జూన్ నాటికి ఈ ‘డ్రోన్ సూపర్ హైవే’ ఏర్పాటును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే దీనికి ఎంత ఖర్చవుతుందనే అంచనాలను వెల్లడించలేదు.
Also read: Submarine: జలాంతర్గామి ‘సింధుధ్వజ్’ నిష్క్రమణ
ఏమిటీ డీఏఏ టెక్నాలజీ?
గాల్లో ఎగురుతూ వెళ్లే డ్రోన్లు, ఇతర యూఏవీ (అన్‌మ్యాన్‌డ్ ఏరియల్ వెహికల్స్)లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ.. అవి ఒకదానికొకటి ఢీకొట్టుకోకుండా చేసేందుకు ఆల్టిట్యూడ్ ఏంజిల్ సంస్థ ‘డీఏఏ’ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. దీనిలో భాగంగా డ్రోన్లు ప్రయాణించే ప్రాంతాల్లో నిర్ణీత దూరంలో పెద్ద టవర్లను నిర్మించి, పలు రకాల పరికరాలను అమర్చుతారు. వీటికి యారో టవర్స్ అని పేరుపెట్టారు. ఈ వ్యవస్థ ఎంతెంత పరిమాణంలో ఉన్న డ్రోన్లు.. ఎటువైపు నుంచి, ఎంత వేగంతో ప్రయాణిస్తున్నాయనేది గుర్తించి.. మిగతా డ్రోన్లకు సమాచారం ఇస్తుంది. ఢీకొట్టుకునే అవకాశమున్న డ్రోన్లకు వాటి మార్గం మార్చుకోవడం, మరికాస్త ఎత్తుకు ఎగరడం లేదా కిందికి దిగడం, వేగం తగ్గించుకోవడం, పెంచుకోవడం వంటి సూచనలు చేస్తుంది.
Also read: Submarine Sindhu Dhwaj : విధుల నుంచి వీడ్కోలు
Download Current Affairs PDFs Here
Download Sakshi Education Mobile APP