DRDO: వీఎల్–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం ప్రయోగ పరీక్షను ఎక్కడ నిర్వహించారు?
Telugu Current Affairs - Science & Techonology: ఒడిశా తీరం చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి జూన్ 24న చేపట్టిన వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి (వీఎల్–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం) ప్రయోగ పరీక్ష విజయవంతమైంది. నేవీ షిప్ నుంచి గగనతలంలోని లక్ష్యాన్ని ఈ క్షిపణి నిర్దేశించిన పరిమితుల ప్రకారం ఛేదించిందని అధికారులు తెలిపారు. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), ఇండియన్ నేవీ సంయుక్తంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించాయి.
GSAT-24 satellite : జీశాట్–24 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం
వీఎల్–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం.. ఆయుధ వ్యవస్థ అత్యంత సమీపంలోని వివిధ రకాల లక్ష్యాలను అడ్డుకుంటుంది. రాడార్ తదితరాలకు దొరక్కుండా తప్పించుకునే వాటిని కూడా ఎదుర్కొంటుంది. తాజా ప్రయోగం విజయవంతం అవడంతో భారత నావికాదళం.. గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Sticky Bomb: స్టికీ బాంబుల్ని తొలిసారి ఎప్పుడు ఉపయోగించారు?GK Awards Quiz: ఇండియన్ ఫార్మా లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు విజేత?
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ క్షిపణి (వీఎల్–ఎస్‌ఆర్‌ఎస్‌ఏఎం) ప్రయోగ పరీక్ష విజయవంతం
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో), ఇండియన్ నేవీ
ఎక్కడ : చండీపూర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్), బాలసోర్ జిల్లా, ఒడిశా
ఎందుకు : భారత నావికాదళం.. గగనతలం నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనే సామర్థ్యం మరింత పెరుగుతుందని..
GK Important Dates Quiz: ప్రపంచ పశువైద్య దినోత్సవం ఎప్పుడు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్