Sticky Bomb: స్టికీ బాంబుల్ని తొలిసారి ఎప్పుడు ఉపయోగించారు?
హిందువులకు అత్యంత పవిత్రమైన అమర్‌నాథ్ యాత్రను భగ్నం చేయడానికి ఉగ్రవాదులు స్టికీ బాంబులతో సవాల్ విసురుతున్నారు. ఇందులో భాగంగా వాటిని డ్రోన్ల ద్వారా తరలిస్తుండగా జమ్ము పోలీసులు జూన్ 6న స్వాధీనం చేసుకున్నారు. జమ్ము శివార్లలో పాకిస్తాన్ డ్రోన్ ఒకటి ఓ పేలోడ్‌ను జారవిడిచింది. స్టికీ బాంబులతో కూడిన టిఫిన్ బాక్సులు అందులో దొరికాయి.
Missile Test: జిర్కాన్ హైపర్‌సోనిక్ క్రూజ్ క్షిపణి పరీక్షను నిర్వహించిన దేశం?
GK Sports Quiz: ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఏ నగరంలో ప్రారంభించారు?
స్టికీ బాంబుల్ని తొలిసారి వాడిందెప్పుడు?
స్టికీ బాంబుల్ని తొలిసారిగా బ్రిటన్ రెండో ప్రపంచ యుద్ధంలో వినియోగించింది. అప్పట్లో ఇది గ్రెనేడ్‌లా ఉండేది. గోళాకారపు గాజు ఫ్లాస్క్‌లో నైట్రో గ్లిసరిన్ నింపి తయారు చేసేవారు. దాన్ని లోహంతో కవర్ చేసి అంటించేవారు. బాంబును ప్రయోగించేటప్పుడు దాని రక్షణ కవచాన్ని బయటకు లాగి విసిరేవారు. ఐదు సెకండ్లలో బాంబు పేలేది.
Monkeypox: మంకీపాక్స్ అంటే ఏమిటీ? ఎలా వ్యాపిస్తుంది.. లక్షణాలు ఏమిటీ.. చికిత్స ఎలా..
WHO: వరల్డ్ నో టొబాకో డే అవార్డు–2022కు ఎంపికైన రాష్ట్రం?
ఏమిటీ స్టికీ బాంబులు?
చిన్న సైజుల్లో ఉండే బాక్సుల్లో పేలుడు పదార్థాలుంచి ఈ బాంబుల్ని తయారు చేస్తారు. వాటికి నాణెం ఆకారంలోని మాగ్నెట్లను అతికిస్తారు. దాంతో ఈ బాంబులు వాహనాలకు సులభంగా అతుక్కుంటాయి. టైమర్‌తో అనుకున్న సమయానికి వీటిని పేల్చవచ్చు. వీటి తయారీ చౌకే గాక తరలించడమూ సులభమే. వీటిని వాడే ప్రక్రియ ఒకప్పుడు కాస్త సంక్లిష్టంగా ఉండేది. కానీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వచ్చాక అదీ సులభంగా మారింది. పార్క్ చేసిన వాహనాలకు వీటిని అతికించి రిమోట్‌తో పేలుస్తారు.
GK Important Dates Quiz: జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?GK Important Dates Quiz: అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్