WHO: వరల్డ్ నో టొబాకో డే అవార్డు–2022కు ఎంపికైన రాష్ట్రం?
1. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి.
1) పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంని భారత ప్రభుత్వం మే 29,2021న ప్రారంభించింది.
2) మార్చి 11, 2020 నుంచి ఫిబ్రవరి 28, 2022 మధ్య కోవిడ్ 19తో తమ తల్లిదండ్రులు ఇరువురు లేదా తమ సంరక్షకులను కోల్పోయిన పిల్లలకు సహాయం అందించడానికి పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ప్రారంభించారు.
3) పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ ప్రోగ్రాంకి నోడల్ ఏజెన్సీగా కేంద్ర మహిళా, శిశు మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వర్తిస్తుంది.
పై వాక్యాల్లో సరైన వాటిని గుర్తించండి.
A) 1 మాత్రమే
B) 1 మరియు 2
C) 2 మరియు 3
D) అన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: D
2. శక్తిమంతమైన జిర్కాన్ హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించి వార్తల్లో నిలిచిన దేశం?
A) రష్యా
B) అమెరికా
C) నార్త్ కొరియా
D) చైనా
- View Answer
- సమాధానం: A
3. దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ప్రతికూలతలను దృష్టిలో ఉంచుకొని ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వార్షిక ప్రీమియం ధరలను జూన్ 1, 2022 తేదీ నుంచి ఎంతకు పెంచడం జరిగింది?
A) జీవనజ్యోతి బీమా యోజన ప్రీమియంను రూ.330 నుంచి రూ.436కు, సురక్ష యోజన ప్రీమియంను రూ.12 నుంచి రూ.20కి
B) జీవనజ్యోతి బీమా యోజన ప్రీమియంను రూ.330 నుంచి రూ.400కు, సురక్ష యోజన ప్రీమియంను రూ.12 నుంచి రూ.16కి
C) జీవనజ్యోతి బీమా యోజన ప్రీమియంను రూ.330 నుంచి రూ.436కు, సురక్ష యోజన ప్రీమియంను రూ.12 నుంచి రూ.15కి
D) జీవనజ్యోతి బీమా యోజన ప్రీమియంను రూ.330 నుంచి రూ.350కు, సురక్ష యోజన ప్రీమియంను రూ.12 నుంచి రూ.20కి
- View Answer
- సమాధానం: A
4. 2021–22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచిన దేశం?
A) అమెరికా
B) చైనా
C) సింగపూర్
D) జపాన్
- View Answer
- సమాధానం: A
5. పొగాకు వినియోగాన్ని తగ్గించడంలో చేసిన కృషికి గానూ ’వరల్డ్ నో టొబాకో డే అవార్డు–2022’కు భారతదేశంలోని ఏ రాష్ట్రాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేసింది.
A)జార్ఖండ్
B)కర్ణాటక
C)ఉత్తరప్రదేశ్
D)బిహార్
- View Answer
- సమాధానం: A
6. ప్రపంచంలోనే మొట్టమొదటి నానో యూరియా లిక్విడ్ ప్లాంట్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు.
A) గుజరాత్
B) రాజస్థాన్
C) హర్యానా
D) కర్ణాటక
- View Answer
- సమాధానం: A
Current Affairs Practice Tests
7. ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) కి సంబంధించి ఈ క్రింది వాటిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి.
A) 2022 సంవత్సరంలో జరిగిన ఐపీఎల్ 15వ ఎడిషన్
B) ఐపీఎల్ 2022 గెలిచిన గుజరాత్ టైటాన్స్, చరిత్రలో ఈ టోర్నీ గెలిచిన ఏడవ జట్టు
C) ఐపీఎల్ చరిత్రలో అత్యధిక టైటిళ్లు గెలిచిన జట్టు ముంబయి ఇండియన్స్
D) ఐపీఎల్ 2022లో ఆడిన మొత్తం జట్ల సంఖ్య12
- View Answer
- సమాధానం: D