Current Affairs Practice Test: ఇటీవల ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా గెలుపొందిన లేబర్ పార్టీ నాయకుడు?
1. ఈ కింది వాక్యాలను పరిశీలించండి.
1. ఈట్ రైట్ రైల్వే స్టేషన్లు ప్రస్తుతం భారతదేశంలో ఏడు ఉన్నాయి.
2. ఈట్ రైట్ సర్టిఫికేషన్‌ను ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జారీ చేస్తుంది.
3. మంచి ఆహార ప్రమాణాలను పాటించే రైల్వే స్టేషన్లకు ఈట్ రైట్ సర్టిఫికేషన్ జారీ చేస్తారు. సరైన వాక్యాలను గుర్తించండి?
ఎ) 1,2
బి) 2,3
సి) 1,3
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
2. Jamaica, Saint Vincent, Grenadinesఅనే ద్వీపకల్ప దేశములను పర్యటించిన మొట్టమొదటి భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ నిలిచారు. ఈ దేశాలు ఎక్కడ నెలకొని ఉన్నాయి?
ఎ) ఎర్ర సముద్రం
బి) నల్ల సముద్రం
సి) అరేబియన్ సముద్రం
డి) కరేబియన్ సముద్రం
- View Answer
- సమాధానం: డి
3. అంతర్జాతీయ ప్రయాణ, పర్యాటకాభివృద్ధి సూచీ– 2021కి సంబంధించి ఈ కింది వాక్యాలను పరిశీలించండి.
1. అంతర్జాతీయ ప్రయాణ, పర్యాటకాభివృద్ధి సూచీ–2021లో భారత్ స్థానం 54.
2. భారత్ 2019లో 46వ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఎనిమిది స్థానాలు దిగజారింది.
3. జపాన్ ఈ జాబితాలో అగ్ర స్థానంలో ఉండగా.. అమెరికా, స్పెయిన్ , ఫ్రాన్స్, జర్మనీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
4. ఈ సూచీని ప్రతి రెండేళ్లకోసారి వరల్డ్ ఎకనామిక్ ఫోరం విడుదల చేస్తుంది.
సరైన వాక్యాన్ని గుర్తించండి?
ఎ) 1,2,4
బి) 2,4
సి) 1,3,4
డి) పైవన్నీ
- View Answer
- సమాధానం: డి
4. ఇటీవల ఇండో పసిఫిక్ దేశాల మధ్య ఇండో పసిఫిక్ ఎకనామిక్ ఫ్రేమ్‌వర్క్ (ఐపీఈఎఫ్) పేరుతో సరికొత్త వర్తక ఒప్పందం కుదిరింది. ఇది ఎన్ని దేశాల మధ్య కుదిరిన ఒప్పందం?
ఎ) 10
బి) 11
సి) 12
డి) 13
- View Answer
- సమాధానం: సి
5. మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తి నియంత్రణలో భాగంగా వ్యాధి సోకిన వారికి 21 రోజుల క్వారెంటైన్ తప్పనిసరి చేసిన తొలి దేశంగా వార్తల్లో నిలిచిన దేశం?
ఎ) బెల్జియం
బి) స్పెయిన్
సి) స్వీడన్
డి) ఫిన్లాండ్
- View Answer
- సమాధానం: ఎ
Current Affairs Practice Tests
6. సూపర్‌బెట్ ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ పోలెండ్ చెస్ టోర్నమెంట్లో ర్యాపిడ్ టైటిల్‌ని గెలుచుకున్న చెస్ క్రీడాకారుడు?
ఎ) విశ్వనాథన్ ఆనంద్
బి)మాగ్నస్ కార్ల్ సన్
సి)రాజా రిత్విక్
డి) ప్రజ్ఞానంద
- View Answer
- సమాధానం: ఎ
7. ఇటీవల ప్రధాని అధ్యక్షతన అంతరాష్ట్ర మండలి ఏర్పాటైంది. రాజ్యాంగంలోని ఏ ప్రకరణ అంతరాష్ట్ర మండలి గురించి పేర్కొంటుంది.
ఎ) 262
బి) 263
సి) 264
డి) 265
- View Answer
- సమాధానం: బి
8. ఇటీవల ఆస్ట్రేలియా నూతన ప్రధానిగా గెలుపొందిన లేబర్ పార్టీ నాయకుడు?
ఎ) ఆంటోనీ అల్బనీస్
బి) స్కాట్ మారిసన్
సి) ఎడ్మన్డ్ బార్టన్
డి) విలియం హ్యూస్
- View Answer
- సమాధానం: ఎ
డౌన్లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్(Telugu Current Affairs), స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్లోడ్ ఇలా..
డౌన్లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్