Solar Farm అంతరిక్షంలో చైనా సౌర విద్యుత్ కేంద్రం
Sakshi Education
సూర్యకిరణాలను అంతరిక్షంలోనే ఒడిసిపట్టాలని చైనా తలపోస్తోంది. ఇందుకోసం అంతరిక్షంలోనే సౌర విద్యుత్కేంద్రం నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇది మరో ఆరేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ సోలార్ స్పేస్ స్టేషన్‌లో విద్యుత్, మైక్రోవేవ్‌లను ఉత్పత్తి చేయనున్నారు. దీనిద్వారా కృత్రిమ ఉపగ్రహాల విద్యుత్ అవసరాలను తీర్చగా మిగిలే విద్యుత్‌ను కాంతి పుంజం (సోలార్ బీమ్) రూపంలో భూమిపైకి ప్రసరింపజేస్తారు. భూమిపై నిర్మించిన ప్రత్యేక కేంద్రాలు వాటిని ఒడిసిపట్టి కరెంట్ రూపంలో నిక్షిప్తం చేస్తాయట. వైర్‌లెస్ పవర్ ట్రాన్స్‌మిషన్ పద్ధతిలో ఈ ప్రక్రియ కొనసాగనుంది.
Also read: Space Rocket: అంతరిక్షంలోకి దక్షిణ కొరియా తొలి రాకెట్
Published date : 28 Jun 2022 06:03PM