Space Rocket: అంతరిక్షంలోకి దక్షిణ కొరియా తొలి రాకెట్
దేశీయంగా అభివృద్ధి చేసిన తొలి రాకెట్‌ను దక్షిణ కొరియా విజయవంతంగా ప్రయోగించింది. దీని సాయంతో ఒక ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపింది. తద్వారా రోదసి శక్తిగా ఎదగాలన్న లక్ష్యం దిశగా తొలి అడుగులు వేసింది. స్వీయ సామర్థ్యంతో ఉపగ్రహాన్ని ప్రయోగించిన 10వ దేశంగా దక్షిణ కొరియా గుర్తింపు పొందింది. ఉత్తర కొరియాతో ఉద్రిక్తతల నేపథ్యంలో.. ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. తాజాగా ప్రయోగించిన రాకెట్ పేరు నురి. ఇందులో మూడు దశలు ఉన్నాయి. దీని పొడవు 47 మీటర్లు. ఇది ప్రయోగాత్మక ఉపగ్రహాన్ని 700 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టింది. నురి రాకెట్‌ను ప్రయోగించడం ఇది రెండోసారి. గత ఏడాది చేపట్టిన తొలి ప్రయోగంలో ఒక డమ్మీ పేలోడ్‌ను దక్షిణ కొరియా పంపింది. రాకెట్‌లోని మూడో దశ ఇంజిన్ లో తలెత్తిన లోపం కారణంగా నాడు అది నిర్దేశిత కక్ష్యను చేరలేకపోయింది.
World Directory of Modern Military Aircraft: ప్రపంచంలోని ఉత్తమ ఎయిర్‌ఫోర్స్‌లలో.. భారత వైమానిక దళం