Avian Influenza: మనిషిలో తొలిసారి బర్డ్‌ఫ్లూ వైరస్‌ను ఏ దేశంలో గుర్తించారు?
ఇంతవరకు పక్షులకు మాత్రమే పరిమితమైన బర్డ్‌ఫ్లూ మనుషుల్లోనూ కనిపిస్తోంది. అమెరికాలో కొలరాడోలోని ఒక కోళ్లఫారంలో పనిచేసే వ్యక్తికి హెచ్5ఎన్1 బర్డ్ ఫ్లూ సోకినట్లు అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకటించింది. ఈ వ్యక్తి పనిచేసే కోళ్లఫారంలో కోళ్లకు బర్డ్‌ఫ్లూ సోకి ఉంటుందని, వీటిని మూకుమ్మడిగా అంతం చేసే పని ఇతనికి అప్పగించారని, ఆ సమయంలో ఏవియన్ ఫ్లూ వైరస్ (బర్డ్‌ఫ్లూ) సోకి ఉంటుందని పేర్కొన్నట్లు రాయిటర్స్ వార్తాసంస్థ తెలిపింది. అమెరికాలో ఇది తొలి బర్డ్‌ప్లూ కేసు(మనుషులకు సోకడం) కాగా, ప్రపంచంలో మూడోది. తొలి కేసు బ్రిటన్‌లో, రెండో కేసు చైనాలో నమోదైన విషయం విదితమే. పక్షుల్లో ఇన్‌ఫ్లూయంజా వైరస్ వల్ల బర్డ్‌ఫ్లూ వ్యాపిస్తుంది. వాటిని ఐసోలేట్ చేసి చంపడం ద్వారా ఇతర పక్షులకు సోకకుండా జాగ్రత్త పడతారు.
GK Science & Technology Quiz: ఇస్రో కు చెందిన ఏ అంతరిక్ష మిషన్ మొదటిసారిగా 'సోలార్ ప్రోటాన్ ఈవెంట్‌లను' కనుగొంది?Nano Satellite: లక్ష్య శాట్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపిన సంస్థ?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికాలో తొలిసారి మనిషిలో ఏవియన్ ఫ్లూ వైరస్ (బర్డ్‌ఫ్లూ) గుర్తింపు
ఎప్పుడు : ఏప్రిల్ 29
ఎవరు : అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్
ఎక్కడ : కొలరాడో, అమెరికా
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్