WHO: కోవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి
కరోనా కట్టడి కోసం భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) నవంబర్ 3న అనుమతి ఇచ్చింది. కీలకమైన డబ్ల్యూహెచ్‌ఓ సాంకేతిక కమిటీ కోవాగ్జిన్‌కు ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించి డబ్ల్యూహెచ్‌ఓ త్వరలోనే అధికారిక ప్రకటన విడుదల చేయనుంది. డబ్ల్యూహెచ్‌ఓ అధ్యక్షుడు టెడ్రోస్ నవంబర్ 2న ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. ప్రస్తుతం 18 ఏళ్లు పైబడిన వారికి అత్యవసర వినియోగానికిగాను కోవాగ్జిన్‌కు అనుమతి లభించింది. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకటన వస్తే విదేశాల్లో కోవాగ్జిన్ సర్టిఫికెట్‌ను అనుమతిస్తారు.
చదవండి: ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను తయారు చేసిన సంస్థ?
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్