Indian Navy: ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను తయారు చేసిన సంస్థ?
భారత నౌకాదళ అధికారులు ఐఎన్‌ఎస్ విశాఖపట్నం పేరుతో భారీ యుద్ధ నౌకను సిద్ధం చేశారు. త్వరలోనే దీన్ని జాతికి అంకితం చేయనున్నారు. ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌక విశేషాలివీ.
విశాఖపట్నం పేరెందుకు...
ప్రాజెక్ట్–15బీ పేరుతో నాలుగు స్టెల్త్ గైడెడ్ మిౖసైల్ డిస్ట్రాయర్ యుద్ధ నౌకలు తయారు చేయాలని భారత నౌకాదళం సంకల్పించింది. ఈ నౌకలకు దేశంలోని నాలుగు ప్రధాన దిక్కుల్లో ఉన్న కీలక నగరాలైన విశాఖపట్నం, మోర్ముగావ్, ఇంఫాల్, సూరత్ పేర్లను పెట్టాలని సంకల్పించి తొలి షిప్‌ని విశాఖపట్నం పేరుతో తయారు చేశారు.
వై–12704 పేరుతో శ్రీకారం..
2011 జనవరి 28న నాలుగు యుద్ధ నౌకల తయారీ ప్రాజెక్ట్ ఒప్పందం జరిగింది. డైరెక్టర్ ఆఫ్ నేవల్ డిజైన్, ఇండియన్ నేవీకి చెందిన సంస్థలు షిప్ డిజైన్లని సిద్ధం చేశాయి. 2013 అక్టోబర్‌లో విశాఖపట్నం యుద్ధనౌక షిప్ తయారీకి వై–12704 పేరుతో ముంబైలోని మజ్‌గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్) శ్రీకారం చుట్టింది. తదనంతరం 2020లో రెండుసార్లు విజయవంతంగా సీ ట్రయల్స్ పూర్తి చేసిన అనంతరం తూర్పు నౌకాదళానికి ఐఎన్‌ఎస్ విశాఖపట్నం నౌకను 2021, అక్టోబర్ 28న అప్పగించారు. 2021, డిసెంబర్‌లో దీనిని జాతికి అంకితం చేయనున్నారు.
ఐఎన్‌ఎస్ విశాఖపట్నం విశేషాలు...
- బరువు: 7,400 టన్నులు
- పొడవు: 163 మీటర్లు
- బీమ్: 17.4 మీటర్లు
- డ్రాఫ్ట్: 5.4 మీటర్లు
- వేగం గంటకు 30 నాటికల్ మైళ్లు
- స్వదేశీ పరిజ్ఞానం 75 శాతం
- పరిధి: ఏకధాటిన 4 వేల నాటికల్ మైళ్ల ప్రయాణం
- ఆయుధాలు: 32 బరాక్ ఎయిర్ క్షిపణులు, 16 బ్రహ్మోస్ యాంటీషిప్, ల్యాండ్ అటాక్ క్షిపణులు, 76 ఎంఎం సూపర్ రాపిడ్ గన్‌మౌంట్, నాలుగు ఏకే–630 తుపాకులు, 533 ఎంఎం టార్పెడో ట్యూబ్ లాంచర్స్ నాలుగు, రెండు జలాంతర్గామి వ్యతిరేక రాకెట్ లాంచర్లు
- విమానాలు: రెండు వెస్ట్‌ల్యాండ్ సీ కింగ్ విమానాలు లేదు రెండు హెచ్‌ఏఎల్ ధృవ్ విమానాల్ని తీసుకెళ్లగలదు
చదవండి: దేశంలో మొట్టమొదటి, ఏకైక ఖండాంతర క్షిపణి ఏది?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐఎన్‌ఎస్ విశాఖపట్నం యుద్ధ నౌకను తయారు చేసిన సంస్థ?
ఎప్పుడు : అక్టోబర్ 31
ఎవరు : ముంబైలోని మజ్‌గావ్ డాక్స్ లిమిటెడ్ (ఎండీఎల్)
ఎక్కడ : ముంబై, మహారాష్ట్ర
ఎందుకు : భారత రక్షణ వ్యవస్థను మరింత పటిష్టపరించేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్